దేశమంతా వినాయక చవితి (Ganesh Chaturthi) ఉత్సవాలకు సిద్దమవుతోంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గణనాథుడిని నవరాత్రులు కొలిచేందుకు భక్తులంతా రెడీ అవుతున్నారు. ఈ సారి బహిరంగ ప్రదేశాల్లో గణేశుని మండపాల విషయంలో ఆంక్షలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఎప్పటిలాగే చాలా మంది తమ తమ ఇళ్లల్లో గణేశుడికి పూజలు చేసే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వినాయక చవితి నేపథ్యంలో సెలబ్రిటీలు వినాయకుడి విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు.
తాజాగా బాలీవుడ్ (Bollywood) నటి శిల్పాశెట్టి (Shilpa Shetty) వినాయకుడి కోసం ముంబై వీధుల్లోకి వచ్చింది. బుధవారం శిల్పాశెట్టి గణేశుడి ప్రతిమను కొనుగోలు చేసింది. అనంతరం గణనాథుడిని క్షేమంగా ఇంటికి తీసుకెళ్లేందుకు కారు డిక్కీలో పెట్టింది. శిల్పాశెట్టి గణేశుడి కోసం వస్తున్న సమాచారంతో పెద్ద సంఖ్యలో జనాలు గుమిగూడారు. శిల్పాశెట్టి, గణేశుడి విగ్రహాన్ని తమ కెమెరాల్లో బంధించారు.
ఇటీవలే వివాదాస్పద పోర్న్ రాకెట్ కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్టైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంతో ఒక్కసారిగా షాక్ కు లోనైంది శిల్పాశెట్టి. ఇక ఆ షాక్ నుంచి మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటోంది. వినాయక చవితి వేడుకలకు ముస్తాబవుతూ మళ్లీ ప్రశాంతమైన జీవనం సాగిస్తుందని తాజా ఫొటోలు చూస్తే అర్థమవుతోంది. శిల్పాశెట్టి నటించిన హంగామా 2 ఇటీవలే విడుదలైంది. కాగా ప్రస్తుతం నికమ్మ సినిమా చేస్తోంది శిల్పాశెట్టి.
Vijay Deverakonda | ముంబైతో పోలిస్తే నేను సోమరి హైదరాబాదీని
Sanjay Dutt: సౌత్లోను బిజీ అవుతున్న సంజయ్ దత్