Year Ender 2024 | మరికొద్ది రోజుల్లో 2024 సంవత్సరం ముగియనున్నది. ఈ క్రమంలో ప్రముఖ సెర్చింజన్ గూగుల్ ఈ ఏడాదికి సంబంధించిన ‘ఇయర్ ఇన్ సెర్చ్’ ట్రెండ్స్‌ని రిలీజ్ చేసింది. ముఖ్యంగా పాకిస్థానీలు భారత్‌కు చెందిన వివిధ అంశాలపై ఆరా తీశారు. ఎక్కువ ఇంటర్నెట్లో ఏ అంశాల గురించి సెర్చ్ చేశారో ట్రెండ్స్‌ని విడుదల చేసింది. వాటిని ఆరు కేటగిరిలుగా విభజిస్తూ రిలీజ్ చేసింది.
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ – టీమిండియా మ్యాచ్, భారత్-ఇంగ్లండ్, భారత్ – ఆస్ట్రేలియా, భారత్ – దక్షిణాఫ్రికా మ్యాచ్‌ల గురించి తెలుసుకునేందుకు పాకిస్థానీలు ఎక్కువగా ఆసక్తి చూపించారని.. ఈ క్రమంలోనే గూగుల్ తెగ వెతికినట్లు ట్రెండ్స్‌లో పేర్కొంది.
అపరకుబేరుడు, ప్రముఖ వ్యాపారవేత్త అయిన ముకేశ్ అంబానీ గురించి పాకిస్థానీలు గూగుల్‌లో తెగ వెతికేశారట. ఈ క్రమంలోనే ఆయన గూగుల్ సెర్చ్ ఇన్ ఇయర్లో 2024లో ప్రముఖ వ్యక్తిగా నిలిచారు.
ఇండియన్ సినిమాలకు పాక్‌లో భారీగానే క్రేజ్ ఉంటుంది. ఈ క్రమంలో అక్కడ బాలీవుడ్ సినిమాలు సైతం పెద్ద ఎత్తున ప్రదర్శిస్తుంటారు. అయితే, ఈ ఏడాది యానిమల్, స్త్రీ-2, 12 ఫెయిల్ మూవీస్‌తో పాటు హీరామండి, మీర్జాపూర్ సీజన్-3 వెబ్‌సిరీస్‌తో పాటు బిగ్‌బాస్-17 రియాలిటీ షో తదితర వివరాల కోసం పాకిస్థానీలు గూగుల్‌లో వెతికారు.
పాకిస్థానీలు భారతీయ వంటకాల తయారీతో పాటు టెక్నాలజీ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపించినట్లుగా గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్-2024 పేర్కొంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ ఏడాదిలో భారతీయులు పాకిస్థాన్ గురించి ఏ అంశంపైనైనా తెలుసుకునేందుకు ఆసక్తి చూపించలేదని వివరించింది.
Year Ender 2024 | ఈ ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సినీతారలు వీళ్లే..!
Year Ender 2024 | ఓటర్లతో మామూలుగా ఉండదు..! లోక్‌సభ నుంచి అసెంబ్లీ వరకు ఊహించిన ఫలితాలు..!