Year Ender 2024 | వివాహం అనేది జీవితంలో ఓ గొప్ప పండుగ. 2024లో చాలా మంది సెలబ్రిటీలు తమ బ్యాచిలర్ జీవితానికి స్వస్తి పలికి వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. ఏడడుగులు నడిచి కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పలువురు సినీరంగ ప్రముఖులో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.
అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ వివాహం చేసుకున్నారు. జనవరి 3న ఫిట్నెస్ కోచ్ నూపుర్ శిఖరేతో ఐరా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ఈ జంట మళ్లీ రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నది. ఆ తర్వాత ముంబయిలో గ్రాండ్‌గా వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. అమీర్‌ఖాన్ - రీనా దత్త కూతురే ఐరా ఖాన్. మెంటల్ హెల్త్ సపోర్ట్ ఆర్గనైజేషన్ సంస్థ వ్యవస్థాపకురాలు ఐరా. నుపూర్ శిఖరే అమీర్‌ఖాన్‌కు వ్యక్తిగత ఫిట్నెస్ ట్రైనర్‌గా ఉన్నాడు.
ఈ ఏడాది వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని ఆమె పెళ్లి చేసుకున్నారు. దాదాపు మూడేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఫిబ్రవరి 21న గోవాలో వెడ్డింగ్ గ్రాండ్‌గా జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
టాలీవుడ్ హీరోయిన్ కృతి కర్బందా సైతం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. హీరో పుల్కిత్ సామ్రాట్‌తో ఏడడుగులు వేసింది. మార్చి 15న హర్యానాలోని గురుగ్రామ్‌లో వీరి పెళ్లి వైభవంగా జరిగింది. దాదాపు ఐదేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఇద్దరు పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే, పుల్కిత్‌కు గతంలో పెళ్లయ్యింది. శ్వేతా రోహిరాని 2014లో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన 11 నెలలకే విడిపోయారు. కృతి కర్బంద, పుల్కిత్ జంట 2019లో పాగల్పంటి చిత్రంలో నటించారు. ఆ సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు.
బాలీవుడ్ నటి తాప్సీ పన్ను బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మాథియాస్ బోను పెళ్లి చేసుకున్నారు. మార్చి 23న ఉదయ్‌పూర్‌లో తాప్సీ, మథియాస్ బో పెళ్లి జరిగింది. మథియస్ బో ప్రేమలో ఉన్న తాప్సీ చివరకు పెళ్లి చేసుకుంది. అత్యంత సన్నిహితులు, బంధుమిత్రులు వివాహానికి హాజరయ్యారు. పెళ్లి విషయాన్ని తాప్సీ సీక్రెట్‌గా ఉంచింది. అయితే, తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా పెళ్లికి సంబంధించి కీలక ప్రకటన చేసింది. తనకు 2023 మార్చిలోనే అయ్యిందని ప్రకటించింది.
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఈ ఏడాది జహీర్ ఇక్బాల్‌ను మనువాడారు. జూన్ 23న సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారు. దాదాపు ఏడేళ్లుగా డేటింగ్లో ఉన్న ఇద్దరు ఎలాంటి ఆర్భాటాలు లేకుండానే పెళ్లితో ఒక్కటయ్యారు. సోనాక్షి, జహీర్ వేర్వేరు వర్గానికి చెందినవారు కావడంతో కొత్త జంటను పలువురు నెటిజన్స్ విమర్శించారు.
అదితీ రావ్ హైదరీ, సిద్ధార్థ్ జంట పెళ్లితో ఒక్కటయ్యింది. సెప్టెంబర్‌లో వీరి పెళ్లి రహస్యంగా జరిగింది. అదితీరావు 2002లో సత్యదీప్ మిశ్రాను పెళ్లి చేసుకొని ఆ తర్వాత 2012లో విడాకులు తీసుకున్నారు. వనపర్తి జిల్లాలోని రంగనాథస్వామి ఆలయంలో మార్చి 27న సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. మళ్లీ అదే ఆలయంలో కుటుంబీకులు, స్నేహితుల మధ్య పెళ్లితో ఒక్కటయ్యారు. హీరో సిద్ధార్థ్‌కు సైతం గతంలో పెళ్లవగా విడాకులు తీసుకున్నారు.
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య మళ్లీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. నటి శోభితా ధూళిపాళను పెళ్లి చేసుకున్నారు. డిసెంబర్ 4న అక్కినేని స్టూడియోలో ఏర్పాటు చేసిన సెట్లో పెళ్లి వైభవంగా జరిగింది. కుటుంబీకులతో పాటు టాలీవుడ్‌కి చెందిన ప్రముఖులు సైతం హాజరయ్యారు. అంతకు ముందు నాగచైతన్య హీరోయిన్ సమంతను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. అనంతరం శోభితతో డేటింగ్లో ఉన్న నాగచైతన్య.. ఆ తర్వాత పెళ్లితో ఒక్కటయ్యారు.
ఈ ఏడాదిలో పెళ్లి చేసుకున్న మరో హీరోయిన్ కీర్తి సురేశ్. తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిల్‌ను పెళ్లి చేసుకున్నది. డిసెంబర్ 12న గోవాలో వీరిద్దరి పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. స్కూల్ నుంచి కాలేజీ వరకు ఇద్దరు స్నేహితులు.. ఆ తర్వాత స్నేహం ప్రేమగా మారింది. కీర్తి సురేశ్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్నది. ఆంటోనీ తట్టిల్‌కి చెన్నై, కేరళలోని కొచ్చిలో వ్యాపారాలున్నాయి.
ప్రముఖ నటి అమీ జాక్సన్ రెండోసారి పెళ్లి చేసుకున్నది. ఎడ్ వెస్ట్విక్ ఆగస్టు 25న ఇటలీలోని వీరి పెళ్లి జరిగింది. అమాల్ఫీ తీరంలో జరిగిన పెళ్లికి సన్నిహితులు కుటుంబ సభ్యులతో పెళ్లి చేసుకున్నారు. అమీ జానక్స్కు ఇంతకు జార్జ్ పనియోటౌ అనే వ్యాపారవేత్తతో సహజీవనం చేశారు. ఈ జంటకు ఆండ్రూ అనే బాబు పుట్టాడు. 2020లో అమీ, జార్జ్ వివాహం చేసుకోవాలనుకోగా.. కరోనా కారణంగా వాయిదాపడింది. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా విడిపోయారు.
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహ సైతం వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. సీనియర్ నటుడు మురళీమోహన్ మనుమరాలు రాగతో ఈనెలలోనే దుబాయిలో వివాహం జరిగింది. వేడుకకు కుటుంబీకులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.