Woman Forced Into Prostitution | వ్యభిచారం చేయాలని అత్తింటి కుటుంబం ఒత్తిడి.. మహిళ ఆత్మహత్య
Woman Forced Into Prostitution | ఒక మహిళను అత్తింటి కుటుంబం వేధించింది. వ్యభిచారం చేయాలని ఆమెను బలవంతం చేశారు. వేధింపులు భరించలేక ఆ యువతి ఆత్మహత్య చేసుకున్నది. ఆమె తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త, మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
బెంగళూరు: ఒక మహిళను అత్తింటి కుటుంబం వేధించింది. వ్యభిచారం చేయాలని ఆమెను బలవంతం చేశారు. వేధింపులు భరించలేక ఆ యువతి ఆత్మహత్య చేసుకున్నది. ఆమె తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త, మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భాల్కికి చెందిన 22 ఏళ్ల అంజనాబాయికి బసవకల్యాణ్ ప్రాంతానికి చెందిన శేఖర్ పాటిల్‌తో 2022లో వివాహమైంది. ఈ దంపతులకు 11 నెలల చిన్నారి సంతానం.
కాగా, అంజనాబాయి అత్తవారింట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్త, అత్తమామలు తన కుమార్తెను ప్రతిరోజూ మానసికంగా, శారీరకంగా వేధించారని, వ్యభిచారం చేయమని ఒత్తిడి చేసినట్లు ఆరోపించాడు. అక్రమ సంబంధాలు నిరాకరించినందుకు తన కుమార్తెపై దాడి చేయడంతోపాటు తీవ్ర మానసిక క్షోభకు గురిచేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
మరోవైపు భర్త శేఖర్ పాటిల్, అత్తింటి కుటుంబానికి చెందిన మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మహిళ ఆత్మహత్య, ఆమె తండ్రి ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Watch: ‘నేను ఠాకూర్, నాతో పెట్టుకోవద్దు’.. కస్టమర్‌ను దూషించిన బ్యాంకు ఉద్యోగిని
Mamata Banerjee | సుప్రీంకోర్టులో మమతా హాజరు, వాదనలను ప్రశ్నిస్తూ.. పిటిషన్
Newborn dies | హాస్పిటల్లో అగ్నిప్రమాదం.. ఐసీయూలోని నవజాత శిశువు మృతి
EVMs Found In Car | జిల్లా పరిషత్ ఎన్నికల తర్వాత.. హోటల్ వద్ద కారులో రెండు ఈవీఎంలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

