Mamata Banerjee | సుప్రీంకోర్టులో మమతా హాజరు, వాదనలను ప్రశ్నిస్తూ.. పిటిషన్
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) విషయంలో సీఎం మమతా బెనర్జీ స్వయంగా సుప్రీంకోర్టుకు హాజరై వాదించడాన్ని ప్రశ్నిస్తూ ఒక పిటిషన్ దాఖలైంది. ఇది రాజ్యాంగపరంగా సరికాదని, చట్టపరంగా సమర్థనీయం కాదని అందులో ఆరోపించారు.
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) విషయంలో సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) స్వయంగా సుప్రీంకోర్టుకు హాజరై వాదించడాన్ని ప్రశ్నిస్తూ ఒక పిటిషన్ దాఖలైంది. ఇది రాజ్యాంగపరంగా సరికాదని, చట్టపరంగా సమర్థనీయం కాదని అందులో ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ‘సర్’కు వ్యతిరేకంగా సీఎం మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో వ్యక్తిగతంగా రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 4న స్వయంగా సుప్రీంకోర్టుకు హాజరై వాదించిన మొదటి ముఖ్యమంత్రిగా నిలిచారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ‘సర్’ ప్రక్రియలో సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు.
కాగా, ముఖ్యమంత్రి హోదాలో మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకు స్వయంగా హాజరుకావడం, వాదించడాన్ని ప్రశ్నిస్తూ అఖిల భారత హిందూ మహాసభ మాజీ ఉపాధ్యక్షుడు సతీష్ కుమార్ అగర్వాల్ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. మమతా బెనర్జీ రిట్ పిటిషన్ వ్యక్తిగత లేదా ప్రైవేట్ వివాదం కాదని తెలిపారు. బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం, భారత ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధమైన అధికారాల వినియోగానికి సంబంధించిందని పేర్కొన్నారు.
మరోవైపు సీఎం మమతా బెనర్జీ తన పిటిషన్లో లేవనెత్తిన సమస్యలు పశ్చిమ బెంగాల్ సంస్థాగత పనితీరు, ఎన్నికల సంఘానికి సంబంధించినవి అని ఆ పిటిషన్లో తెలిపారు. ‘ఇలాంటి పరిస్థితులలో పిటిషనర్ అయిన సీఎం వ్యక్తిగతంగా హాజరుకావడం తగదు. ఈ కోర్టు ముందు ఏదైనా ప్రాతినిధ్యం తప్పనిసరిగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే న్యాయవాదుల ద్వారా ఉండాలి’ అని పిటిషన్లో పేర్కొన్నారు.
కాగా, బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు పిటిషనర్ గుర్తు చేశారు. ‘అలాంటప్పుడు సీఎం హోదాలో వ్యక్తిగత హాజరు రాజ్యాంగబద్ధంగా సరికాదు. సంస్థాగతంగా అవాంఛనీయం. చట్టపరంగా సమర్థనీయం కాదు. న్యాయ సంప్రదాయాలు, కోర్టు పద్ధతులు, న్యాయ క్రమశిక్షణ సూత్రాలకు ఇది విరుద్ధం’ అని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ వ్యక్తిగత పిటిషన్, హాజరు, వాదనల అంశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని పిటిషన్‌దారుడు కోరారు.
Also Read:
EVMs Found In Car | జిల్లా పరిషత్ ఎన్నికల తర్వాత.. హోటల్ వద్ద కారులో రెండు ఈవీఎంలు
Newborn dies | హాస్పిటల్లో అగ్నిప్రమాదం.. ఐసీయూలోని నవజాత శిశువు మృతి
BJP Leader Assaults Woman | మహిళను కర్రతో కొట్టి కాళ్లతో తన్నిన బీజేపీ నేత.. వీడియో వైరల్
Watch: రోడ్డుపై జారిన బైక్.. చావు నుంచి తృటిలో తప్పించుకున్న విద్యార్థి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

