లక్నో: ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలకు ఐసీయూలోని నవజాత శిశువు తీవ్ర కాలిన గాయాలతో మరణించింది. దీంతో ఆ శిశువు కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. ఆసుపత్రి నిర్లక్ష్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. (Newborn dies) ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బీతూర్లోని రాజా నర్సింగ్ హోమ్‌లో ఒక మహిళ ఆడబిడ్డను ప్రసవించింది. పుట్టిన వెంటనే ఆ నవజాత శిశువును నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ)లో ఉంచారు.
కాగా, ఆదివారం సాయంత్రం ఆ హాస్పిటల్‌లోని ఎన్ఐసీయూ వార్డులో అగ్నిప్రమాదం సంభవించింది. ఆ నవజాత శిశువు ముఖం, ఛాతి, పొట్టపై తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి. కాకాడియోలోని ప్రైవేట్ పిల్లల నర్సింగ్ హోమ్‌కు తరలిస్తుండగా ఆడ బిడ్డ చనిపోయింది.
మరోవైపు ఆ నవజాత శిశువు కుటుంబ సభ్యులు ఆగ్రహించారు. ఆ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద నిరసన తెలిపారు. హాస్పిటల్ నిర్లక్ష్యం వల్ల బిడ్డ మరణించడంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
EVMs Found In Car | జిల్లా పరిషత్ ఎన్నికల తర్వాత.. హోటల్ వద్ద కారులో రెండు ఈవీఎంలు
BJP Leader Assaults Woman | మహిళను కర్రతో కొట్టి కాళ్లతో తన్నిన బీజేపీ నేత.. వీడియో వైరల్
Watch: రోడ్డుపై జారిన బైక్.. చావు నుంచి తృటిలో తప్పించుకున్న విద్యార్థి