EVMs Found In Car | జిల్లా పరిషత్ ఎన్నికల తర్వాత.. హోటల్ వద్ద కారులో రెండు ఈవీఎంలు
EVMs Found In Car | జిల్లా పరిషత్ ఎన్నికల తర్వాత అర్ధరాత్రి వేళ ఒక హోటల్ వద్ద ఉన్న కారులో రెండు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) కనిపించాయి. దీంతో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఓటింగ్‌కు వినియోగించని ‘రిజర్వ్’ ఈవీఎంలని ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది.
ముంబై: జిల్లా పరిషత్ ఎన్నికల తర్వాత అర్ధరాత్రి వేళ ఒక హోటల్ వద్ద ఉన్న కారులో రెండు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) కనిపించాయి. దీంతో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. (EVMs Found In Car) అయితే ఓటింగ్‌కు వినియోగించని ‘రిజర్వ్’ ఈవీఎంలని ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది. వీటిని సకాలంలో స్ట్రాంగ్ రూమ్‌కు తరలించకపోవడంపై చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోలాపూర్తో సహా 12 జిల్లా పరిషత్, 125 పంచాయతీలకు ఫిబ్రవరి 7న ఎన్నికలు జరిగాయి.
కాగా, పోలింగ్ ముగిసిన తర్వాత శనివారం అర్ధరాత్రి వేళ మోహోల్లోని ఒక హోటల్ సమీపంలో ఎన్నికల విధుల్లో ఉన్న అధికారి కోసం అద్దెకు తీసుకున్న కారులో రెండు ఈవీఎంలు కనిపించాయి. దీంతో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్లు ఎన్సీపీ అభ్యర్థి ఆరోపించారు. దీనిపై విచారణ జరుపాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ సమాచారం తెలిసిన వెంటనే ఎన్నికల రిటర్నింగ్ అధికారి, తహసీల్దార్, పోలీస్ సిబ్బంది ఆ హోటల్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఉన్న కారులోని ఈవీఎంలను తనిఖీ చేశారు. అవి ‘రిజర్వ్’ ఈవీఎంలు అని, ఓటింగ్ కోసం ఉపయోగించలేదని ఎన్నికల అధికారి తెలిపారు. ఆ రెండు ఈవీఎంలు సీలు వేసిన స్థితిలో ఉన్నాయని చెప్పారు.
మహారాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఈ సంఘటనపై స్పందించింది. పోలింగ్ సమయంలో ఎలాంటి అవకతవకలు లేదా అక్రమాలు జరుగలేదని స్పష్టం చేసింది. రిజర్వ్ ఓటింగ్ యంత్రాలను సకాలంలో జమ చేయడంలో విఫలమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
7/2/26 #मतदान प्रक्रिया संपल्या नंतर खाजगी गाडीमध्ये रात्री #मोहोळ जिल्हा #सोलापूर मध्ये #जिल्हापरिषद व #पंचायतसमिती निवडणूक #EVM मशीन ढाब्यावर सापडले.#Solapur #Southsolapur #Mohol #MH13 #सोलापूर #शिवसेना #Shivsena pic.twitter.com/qMR8lGav60
— Amar Patil (official) (@amarpatil5050) February 8, 2026
Also Read:
Three bodies inside car | ఫ్లైఓవర్‌పై ఆగి ఉన్న కారు.. అందులో మూడు మృతదేహాలు
BJP Leader Assaults Woman | మహిళను కర్రతో కొట్టి కాళ్లతో తన్నిన బీజేపీ నేత.. వీడియో వైరల్
Watch: రోడ్డుపై జారిన బైక్.. చావు నుంచి తృటిలో తప్పించుకున్న విద్యార్థి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

