Woman died : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (Andhrapradesh state) ఏలూరు (Eluru town) లోని సుష్మితా డయాగ్నస్టిక్ సెంటర్ (Sushmita Diagnostic Centre) లో ఘోరం జరిగింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఓ మహిళ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కనీస తనిఖీలు చేయకుండా మహిళను ఎమ్మారై మిషన్ (MRI Mechine) లోకి పంపిన సిబ్బంది.. ఆ తర్వాతనైనా ఆమెను పర్యవేక్షించలేదు. మిషన్‌లో రేడియేషన్ (Radiation) భరించలేక ఆమె విలవిల్లాడుతున్నా త్వరగా స్పందించలేదు. నా భార్య విలవిల్లాడుతోందని భర్త మొత్తుకున్నా సకాలంలో సిబ్బంది స్కానింగ్‌ను ఆపలేదు. దాంతో సదరు మహిళ ప్రాణాలు కోల్పోయింది.
సాధారణంగా ఎమ్మారైకి వచ్చిన వ్యక్తుల దగ్గర ఎలాంటి మెటల్ వస్తువులు లేకుండా సిబ్బంది జాగ్రత్త పడుతారు. ఎందుకంటే ఒంటిపై మెటల్ ఉంటే రేడియేషన్ బారినపడే ప్రమాదం ఉంది. ఈ కారణంగా ఎమ్మారై కోసం వచ్చిన వారి ఒంటిపై ఎలాంటి మెటల్ వస్తువులు లేకుండా చూస్తారు. కానీ ఏలూరులోని సుస్మితా డయోగ్నొస్టిక్ సెంటర్లో ఓ మహిళ పట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సిబ్బంది తీరు ఇప్పుడు కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు రూరల్ మండలం ప్రత్తి కోళ్ళంక గ్రామానికి చెందిన నల్లగచ్చు రామతులసమ్మకు గతంలో వైద్యులు పేస్ మేకర్‌ను అమర్చారు. గత కొన్ని రోజులుగా ఆయుష్ ఆస్పత్రిలో ఆమె డయాలసిస్ చేయించుకుంటోంది. ఈ క్రమంలో రామతులసమ్మకు ఎమ్మారై తీయించుకోవాల్సిందిగా డాక్టర్ ప్రవీణ్ కుమార్ సూచించారు. ఏలూరులోని సుష్మిత డయాగ్నస్టిక్ సెంటర్‌కు రిఫర్ చేశారు.
కానీ డయాగ్నస్టిక్ సెంటర్ సిబ్బంది నిర్లక్ష్యంతో మహిళ ప్రాణాలు కోల్పోయింది. స్కానింగ్‌కు ముందు మెటల్ డిటెక్టర్‌తో మహిళను తనిఖీ చేయకుండానే మిషన్‌లోకి పంపించారు. మిషన్‌లోకి వెళ్లిన వెంటనే పేస్ మేకర్ కారణంగా ఆమె రేడియేషన్‌కు గురయ్యారు. రేడియేషన్‌ను భరించలేక రామతులసమ్మ మిషన్‌లో గిలగిలా కొట్టుకున్నారు. చివరకు రేడియేషన్ ప్రభావంతో స్కానింగ్ మిషన్‌లోనే ప్రాణాలు కోల్పోయారు.
స్కానింగ్ మిషన్‌లో భార్య ఉక్కిబిక్కిరి అవుతున్న విషయాన్ని గమనించిన భర్త కోటేశ్వర రావు.. వెంటనే స్కానింగ్ ఆపాలని సిబ్బందిని కోరారు. అయినప్పటికీ సదరు ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోలేదు. నిర్లక్ష్యంగా స్కానింగ్‌ను కొనసాగించారు. ఎమ్మారై స్కానింగ్ చేస్తుండగా తన భార్య తన కళ్లెదుటే విలవిల్లాడుతూ మరణించిందంటూ భర్త కోటేశ్వర రావు విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది.
NASA scientist | అమెరికా అమ్మాయితో ప్రేమలో పడ్డ తమిళ యువకుడు.. తమిళనాడులో ఘనంగా పెళ్లి
Maha Kumbh | మహా కుంభమేళాలో భూటాన్ రాజు.. యూపీ సీఎంతో కలిసి పుణ్య స్నానాలు
Delhi Elections | రేపే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. సర్వం సిద్ధం చేసిన ఈసీ
BRS Whips | బీఆర్ఎస్ పార్టీ విప్‌లుగా సత్యవతి రాథోడ్, కేపీ వివేకానంద్
MLA Prashant Reddy | అసెంబ్లీని వాయిదా వేయడం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం
MLA Talsani | ఇంతటి బాధ్యతారాహిత్య ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు : ఎమ్మెల్యే తలసాని
Harish Rao | ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు?.. అసెంబ్లీ వాయిదాపై హరీశ్‌రావు ఆగ్రహం