Aadarsha Kutumbam | టాలీవుడ్ యాక్టర్ వెంకటేశ్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్నచిత్రం ‘ఆదర్శ కుటుంబం’ (AK47) (Aadarsha Kutumbham). వెంకీ 77వ చిత్రంగా (#Venky77) తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను గాంధీ జయంతి సందర్భంగా, అక్టోబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారని తెలిసిందే. ప్రతి కుటుంబం గుర్తుపెట్టుకోవాల్సిన తేదీ.. అక్టోబర్ 2న ఆదర్శ కుటుంబం తలుపులు తెరుచుకోబోతున్నాయి..అంటూ మేకర్స్ హైప్ పెంచేస్తున్నారు.
తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా వెంకీ పోషిస్తున్న చిట్టిబాబు పాత్ర గ్లింప్స్‌ను షేర్ చేశారు. కిచెన్‌లో ఏసీనా.. నాన్న నువ్వు వంట చేసేటప్పుడు హ్యాపీగా ఏసీ వేసుకుని చేసుకోవచ్చు. అవును నేను మ్యాన్ ఆఫ్ ది హౌస్. వాషింగ్ మెషిన్ కూడా ఉంది.. నీకు పని బాగా తగ్గిపోయినట్టేనని శ్రీనిధి శెట్టి అంటున్న డైలాగ్స్‌తో షురూ అయింది గ్లింప్స్. చిట్టిగారు అని రఘుబాబు అంటుంటే అస్తమానం తలతిప్పకండి బుజ్జిగారు మెడ పట్టేస్తుంది.. నాకు ఎవరేం పని చేసినా నచ్చదు. అందుకే అన్నీ నేనే చూసుకుంటానంటున్నాడు వెంకీ.. ఆదర్శ కుటుంబం అంటూ నారా రోహిత్ డైలాగ్స్‌తో ఎండ్ అయింది గ్లింప్స్. మొత్తానికి చిట్టిబాబుగా వెంకీ అండ్ ఫ్యామిలీ పక్కా వినోదాన్నిఅందించబోతుందని తాజా గ్లింప్స్ చెప్పకనే చెబుతోంది.
ఈ చిత్రంలో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు), వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మొదటి ఫుల్ లెంగ్త్ సినిమా కావడంతో అంచనాలు భారీగానే నెలకొన్నాయి.