KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
KTR | మూడేళ్లయిపోయింది.. సినిమా ఇంటర్వెల్ కూడా పూర్తయిపోయింది. సెకండాఫ్ కూడా చాలా అయింది.. ఇంకా ఎక్కువ టైం కూడా లేదు.. ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు.. మనందరికీ మంచి రోజులొస్తయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ =ధీమా వ్యక్తం చేశారు.
KTR | మీ నిర్మల్ తాలూకాలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నరు, బీజేపీ ఎంపీ ఉన్నరు.. నిర్మల్‌కు బీజేపీ ఏం చేసిందో ప్రశ్న అడగాల్సిన సమయం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో నిర్మల్ జిల్లాకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు కేటీఆర్ సమక్షంలో భారీగా చేరారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఢిల్లీలో బీజేపీ ప్రజలను విభజించడంలో బిజీగా ఉంటే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రజలను దోచుకోవడంలో బిజీగా ఉన్నారు.. తప్ప వాళ్లు చేసిందేమీ కాదు.. మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా, గోడం నగేశ్ ఎంపీగా గెలిచారు.. ఏమొచ్చింది నిర్మల్‌కు.. అదే కేసీఆర్ ఉన్నప్పుడు నిర్మల్‌కు ఏమొచ్చిందని అడగొచ్చు.. నిర్మల్‌ను జిల్లా చేసిందెవరు.. కేసీఆర్.. నిర్మల్‌లో మెడికల్ కాలేజీ పెట్టిందెవరు.. నర్సింగ్ కాలేజీ పెట్టిందెవరు.. నిర్మల్‌లో అభివృద్ధికి బాటలు వేసిందెవరు.. కేసీఆర్.. నిర్మల్ పట్టణంలోకానీ, తాలూకాలో కానీ నేను స్వయంగా వచ్చి మీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రారంభించిన. నేనొచ్చి మిషన్ భగీరథ ద్వారా మీ ఇంటింటికి తాగునీళ్లిచ్చే కార్యక్రమం మొదలుపెట్టిన. బ్రహ్మాండంగా చెక్‌డ్యామ్‌లు కట్టుకున్నం.. అయిల్ ఫామ్‌లు పెట్టుకున్నమన్నారు.
నిర్మల్‌లో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఎంపీ గోడం నగేష్ గెలిచినా నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. పదేళ్లు మంత్రిగా పనిచేసిన ఇంద్రకరణ్ రెడ్డి అధికారం కోల్పోగానే పార్టీని వీడి పారిపోయాడు. అవకాశవాదులు పార్టీని వీడినా, పోరాట యోధులు బీఆర్ఎస్లోనే ఉన్నారన్నారు.
ఎప్పుడైనా ప్రతీ పార్టీలో రెండు రకాల వ్యక్తులుంటారు.. ఒకటి అవకాశవాదులుంటారు.. రెండోది పోరాటవాదులుంటారు.. ఆయన అవకాశవాదంతో బయటకు పోయినా మేమున్నం అన్నా భయపడకండని పోరాడుతున్న మీ అందరికీ తలవంచి నమస్కారం చేస్తున్నా.. మంచి రోజులు ముందున్నయి. ఇంకో సంవత్సరమే వీళ్ల కథ.. మూడేళ్లయిపోయింది.. సినిమా ఇంటర్వెల్ కూడా పూర్తయిపోయింది. సెకండాఫ్ కూడా చాలా అయింది.. ఇంకా ఎక్కువ టైం కూడా లేదు.. ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు.. మనందరికీ మంచి రోజులొస్తయని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
ఢిల్లీలో బీజేపీ ప్రజలను విభజించడంలో బిజీగా ఉంటే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రజలను దోచుకోవడంలో బిజీగా ఉంది.
నిర్మల్‌లో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఎంపీ గోడం నగేష్ గెలిచినా నియోజకవర్గానికి చేసిందేమీ లేదు.
పదేళ్లు మంత్రిగా పనిచేసిన ఇంద్రకరణ్ రెడ్డి అధికారం కోల్పోగానే పార్టీని వీడి పారిపోయాడు.
అవకాశవాదులు పార్టీని వీడినా, పోరాట యోధులు బీఆర్ఎస్లోనే ఉన్నారు.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
— BRS Party (@BRSparty) October 27, 2026
Read Also :
Sigma | ఓటీటీలోకి విజయ్ కొడుకు తొలి సినిమా.. సందీప్ కిషన్ ‘సిగ్మా’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
India-A Vs New Zealand-A: డ్రాగా ముగిసిన ఇండియా-ఏ, న్యూజిలాండ్-ఏ మ్యాచ్
Karimnagar | ఎల్నీనో ఎఫెక్ట్.. ఎండుతున్న పంటలు.. కరువు కోరల్లో కరీంనగర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- BRS Joinings
- Hyderabad
- KCR
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
Cyclone Arnab | ‘అర్నబ్’ ఎఫెక్ట్.. దక్షిణమధ్య రైల్వే అప్రమత్తం.. పలు రైళ్లు రద్దు..!
మీరు ముఖ్యమంత్రి అవుతారు సార్.. కేటీఆర్‌తో బాలుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

