India-A Vs New Zealand-A: డ్రాగా ముగిసిన ఇండియా-ఏ, న్యూజిలాండ్-ఏ మ్యాచ్
India-A Vs New Zealand-A: ఇండియా-ఏ, న్యూజిలాండ్-ఏ మధ్య జరిగిన అనధికార తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. వెలుతురు సరిగా లేని మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆ సమయానికి కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయింది.
లింకన్: ఇండియా-ఏ, న్యూజిలాండ్-ఏ మధ్య జరిగిన అనధికార టెస్టు(India-A Vs New Zealand-A) మ్యాచ్ డ్రాగా ముగిసింది. లింకన్ మైదానంలో జరిగిన టెస్టులో ఆఖరి రోజు ఉత్కంఠ రేపింది. భారత్-ఏ జట్టు దాదాపు విజయానికి చేరువైంది. కానీ మసక వెలుతురు వల్ల .. మ్యాచ్‌ను నిలిపివేశారు. రెండో ఇన్నింగ్స్‌లో 313 టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్-ఏ జట్టు ఆట నిలిచే సమయానికి 9 వికెట్ల నష్టానికి 187 రన్స్ మాత్రమే చేసింది. చివరి రోజు చివరి సెషన్లో మరింత సమయం ఉన్నా.. వెలుతురు సరిగా లేని కారణంగా అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. భారత బౌలర్ నబీ రెండో ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లలో 28 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. అయితే వెలుతురు వల్ల ఆట ఆపిన సమయానికి ఇంకా 17 ఓవర్లు వేయాల్సి ఉంది. ఒకవేళ భారత్ ఆ కోటా పూర్తి చేసి ఉంటే, బహుశా కివీస్ ఓటమి ఎదుర్కొనే అవకాశం ఉండేది. ఉష్ణోగ్రతలు చాలా శీతలంగా ఉన్న కారణంగా, ఇరు జట్ల ప్లేయర్లు కూడా డ్రాకు అంగీకరించారు. అక్టోబర్ 31 నుంచి క్రైస్ట్‌చర్చ్‌లో రెండో టెస్టు ప్రారంభంకానున్నది.
స్కోరు బోర్డు
ఇండియా-ఏ 113 & 516
న్యూజిలాండ్-ఏ 317 & 187/9
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India-A Vs New Zealand-A: డ్రాగా ముగిసిన ఇండియా-ఏ, న్యూజిలాండ్-ఏ మ్యాచ్
Aadarsha Kutumbam | సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఆదర్శ కుటుంబం’.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడే!
పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ నల్లగొండలో భారీ బైక్ ర్యాలీ
Naga Chaitanya | నాగచైతన్య కెరీర్లోనే భారీ డీల్.. రూ.45 కోట్లకు ‘వృషకర్మ’ హక్కులు?
Vijay Deverakonda | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ నుంచి ‘కోబలి’ వీడియో సాంగ్ విడుదల.!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

