IIT Guwahati | గువాహటిలోలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి)లో బీటెక్ మూడవ సంవత్సరం విద్యార్థి( Student dies) ఇన్స్టిట్యూట్ క్యాంపస్‌లో శవమై కనిపించాడు. మృతుడిని ఒడిశాలోని పూరీకి చెందిన రితేష్ రాజ్ సింగ్‌గా(Ritesh Raj Singh) గుర్తించారు. అతను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) విభాగానికి చెందిన విద్యార్థిగా గుర్తించారు.
రితేష్ రాజ్ సింగ్ ఇటీవలే గోల్డ్‌మన్ సాక్స్‌లో ఇంటర్న్‌షిప్ సంపాదించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గువాహటి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు పంపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.