NASA scientist : అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) లో పనిచేస్తున్న తమిళ యువకుడు (Tamil Man) అమెరికా అమ్మాయి (Americal Woman) ని పెళ్లి చేసుకున్నాడు. రెండు కుటుంబాల పెద్దల అంగీకారంతో మంగళవారం ఇద్దరూ ఒక్కటయ్యారు. తమిళనాడు రాష్ట్రం (Tamil Nadu state) తిరువణ్ణామలై (Thiruvannamalai) జిల్లా సెంజి (Senji) లోని ప్రసిద్ధ ఏకాంబరేశ్వర ఆలయం (Ekambarashwara Temple) లో వారి వివాహం జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం వారు వివాహం చేసుకున్నారు.
తిరువణ్ణామలై జిల్లాలోని చెయ్యారు తాలూకా అనకావూరు గ్రామానికి చెందిన భాస్కరన్ (Bhaskaran) భార్య, ఇద్దరు కొడుకులతో కలిసి అమెరికాలో నివసిస్తున్నాడు. పెద్ద కుమారుడు అవినాష్ నాసాలో శాస్త్రవేత్తగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో అతడు అమెరికాకు చెందిన కేథరీన్ ఓసేవి అనే యువతితో ప్రేమలో పడ్డారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థాయికి చేరుకున్నారు.
ఈ క్రమంలోనే రెండు కుటుంబాల పెద్దల అనుమతితో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ఇద్దరూ తమ పెద్దలను ఒప్పించారు. అనంతరం తమిళనాడులోని సెంజిలో వరుడు అవినాశ్ కుల దైవమైన ఏకాంబరేశ్వర ఆలయం (Ekambareshwara Temple) లో వివాహం చేసుకున్నారు. గత ఆదివారం వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో ఇరు కుటుంబాల సభ్యులు, సన్నిహితులు, బంధుమిత్రులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.
Maha Kumbh | మహా కుంభమేళాలో భూటాన్ రాజు.. యూపీ సీఎంతో కలిసి పుణ్య స్నానాలు
Delhi Elections | రేపే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. సర్వం సిద్ధం చేసిన ఈసీ
BRS Whips | బీఆర్ఎస్ పార్టీ విప్‌లుగా సత్యవతి రాథోడ్, కేపీ వివేకానంద్
MLA Prashant Reddy | అసెంబ్లీని వాయిదా వేయడం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం
MLA Talsani | ఇంతటి బాధ్యతారాహిత్య ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు : ఎమ్మెల్యే తలసాని
Harish Rao | ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు?.. అసెంబ్లీ వాయిదాపై హరీశ్‌రావు ఆగ్రహం