Sharad Pawar | ఎన్నికల సంఘం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మునుపెన్నడూ చూడలేదు: శరద్‌పవార్
Sharad Pawar | కేంద్ర ఎన్నికల సంఘం, ఇతర దర్యాప్తు సంస్థలు పాలక వర్గానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్‌పవార్ విమర్శించారు. దేశంలోని అన్ని రాజ్యాంగబద్ధ సంస్థలు మోదీ నాయకత్వంలో పనిచేస్తున్నాయని మండిపడ్డారు.
ముంబై: కేంద్ర ఎన్నికల సంఘం, ఇతర దర్యాప్తు సంస్థలు పాలక వర్గానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్‌పవార్ విమర్శించారు. దేశంలోని అన్ని రాజ్యాంగబద్ధ సంస్థలు మోదీ నాయకత్వంలో పనిచేస్తున్నాయని మండిపడ్డారు. అధికారాన్ని ఎప్పటికీ వాళ్ల చేతుల్లోనే ఉంచే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.
ఎవరో ఫిర్యాదు చేశారని ఎన్నికల సంఘం.. శివసేన పార్టీని, ఆ పార్టీ గుర్తును వ్యవస్థాకులైన వ్యక్తుల నుంచి వేరుచేసి ఫిర్యాదు చేసిన వ్యక్తులకు కేటాయించిందని విమర్శించారు. ఇది రాజకీయ పార్టీలపై పెద్ద దాడిగా చెప్పవచ్చని అన్నారు. ‘ఎన్నికల సంఘం కొన్ని రోజుల క్రితం ఒక నిర్ణయం తీసుకుంది. ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఎలా దుర్వినియోగానికి గురవుతున్నది అనడానికి ఇదొక ఉదాహరణ. ఎన్నికల సంఘం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మునుపెన్నడూ చూడలేదు’ అని పేర్కొన్నారు.
‘శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే తన ఆఖరి గడియల్లో శివసేన పార్టీ బాధ్యతలను తన కుమారుడు ఉద్ధవ్ థాకరేకు అప్పగించాడు. కానీ, ఎవరో ఫిర్యాదు చేస్తే ఎన్నికల సంఘం ఆ పార్టీని, పార్టీ గుర్తును వాళ్లకు కట్టబెట్టింది’ అని విమర్శించారు. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం శివసేన పార్టీని, ఆ పార్టీ విల్లు-బాణం గుర్తును ఏక్నాథ్ షిండే వర్గానికి కేటాయించడంపై పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి..
Shelly Oberoi | ఢిల్లీ మున్సిపల్ చట్టం ప్రకారం నడుచుకుంటా: షెల్లీ ఒబెరాయ్
Tejashwi Yadav | 2024 ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడమే మా లక్ష్యం: తేజస్వి యాదవ్
Shiv Sena | శివసేన ఎన్నికల గుర్తు వివాదం.. ఈసీ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి వేముల
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

