Shiv Sena | శివసేన ఎన్నికల గుర్తు వివాదం.. ఈసీ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
Shiv Sena | శివసేన పార్టీ ఎన్నికల గుర్తు అంశంపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఇటీవల శివసేన ఎన్నికల గుర్తును ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శిబిరానికి ఎన్నికల కమిషన్ కేటాయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Shiv Sena | శివసేన పార్టీ ఎన్నికల గుర్తు అంశంపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఇటీవల శివసేన ఎన్నికల గుర్తును ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శిబిరానికి ఎన్నికల కమిషన్ కేటాయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ పార్దివాలా నేతృత్వంలోని బెంచ్ పిటిషన్ విచారణకు స్వీకరించింది. షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఠాక్రే వర్గం కోర్టును కోరింది.
ఈ విషయంలో ఏదో నిర్ణయం తీసుకునే వరకు యధాస్థితిని కొనసాగించాలని ఉద్ధవ్ వర్గం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. తమకు రక్షణ కావాలని, ఆస్తులు, బ్యాంకు ఖాతాలు స్వాధీనం చేసుకోవడం ఇష్టం లేదన్నారు. శివసేన పార్లమెంటరీ కార్యాలయాన్ని మంగళవారం స్వాధీనం చేసుకున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈసీ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు.. సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి నోటీసులు జారీ చేసింది. విచారణను రెండువారాలు వాయిదా వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

