BRS Party Office | న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో భారత్ రాష్ట్ర కేంద్ర కార్యాలయ నిర్మాణ పనులను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్మాణ ప్రాంగణంలో కలియదిరిగి క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించారు. పనుల పురోగతిపై ఆర్కిటెక్ట్, వర్క్ ఏజెన్సీతో సమీక్ష నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విధించిన నిర్ణీత గడువులోగా పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆయన నిర్మాణ సంస్థకు చెందిన ప్రతినిధులను ఆదేశించారు. మంత్రి వెంట ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజిబుద్దీన్, ఆర్కిటెక్ట్ ఆస్కార్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఉన్నారు.