Viral video : రద్దీ రోడ్డుపైకి ఉన్నట్టుండి అనుకోని అతిథి వచ్చింది. ఏకంగా ఎనిమిది అడుగుల పొడవు ఉన్న మొసలి (Crocadile) నడిరోడ్డుపై దర్శనం ఇచ్చింది. ఆ మొసలిని చూసేందుకు జనం పోటీపడ్డారు. దాంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ (Traffic zam) అయ్యింది. గుజరాత్ (Gujarat) రాష్ట్రం వడోదర (Vadodara) లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వడోదరలో నర్హరి విశ్వామిత్రి నది సమీపంలోని నర్హహరి విశ్వామిత్రి బ్రిడ్జి రోడ్డులో శుక్రవారం రాత్రి ఓ భారీ మొసలి కనిపించింది. ఏకంగా 8 అడుగుల మొసలి రోడ్డుపై కనిపించడంతో ఆ రోడ్డుగుండా ప్రయాణించేవాళ్లు షాకయ్యారు. అత్యంత అరుదైన ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా తిలకించారు. ఆ మొసలిని తమ మొబైల్స్‌లో బంధించేందుకు పోటీపడ్డారు.
దాంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కమిషనర్ బంగ్లాకు సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. జనం తన చుట్టూ గుమిగూడటంతో భయపడిన మొసలి ముందుగా కదలకుండా ఉండిపోయింది. ఆ తర్వాత తప్పించుకునేందుకు ఒక్కసారిగా జనంపైకి ఎగిరింది. అందరూ పరుగు అందుకోగానే రోడ్డు దాటి అవతలివైపునకు వెళ్లి ఆగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంతలో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి వచ్చి, మొసలిని రక్షించి తీసుకెళ్లారు. విశ్వామిత్రి నదిలో వదిలేశారు. ఆ నదిలోని 17 కిలోమీటర్ల పరిధిలో మొత్తం 300కు పైగా మొసళ్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. భారీ వర్షాలవల్ల నదులు ఉప్పొంగడంతో మొసళ్లు దారితప్పి జనావాసాల్లోకి వస్తున్నాయని చెప్పారు.
#Gujarat
An 8-foot crocodile blocked traffic on Narhari Vishwamitri Bridge Road on Thursdya Night. After much effort, the rescue team captured it and handed it over to the forest department. @NewIndianXpress @santwana99 @jayanthjacob #Vadodara #CrocodileRescue pic.twitter.com/Ck5fScHRcq— Dilip Kshatriya (@Kshatriyadilip) July 18, 2025