Vice President Elections | భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ (Vice President Elections) మంగళవారం ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. పార్లమెంట్ (Parliament) నూతన భవనంలోని ‘ఎఫ్-101 వసుధ’లో ఉదయం 10 గంటలకు ఓటింగ్ మొదలైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలి (PM Modi) ఓటు వేశారు. అనంతరం అధికార, విపక్ష కూటమికి చెందిన ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
Delhi | Defence Minister Rajnath Singh casts his vote for the Vice Presidential election at the Parliament House.
(Pic Source: Sansad TV) pic.twitter.com/2oNZfBPh9g
— ANI (@ANI) September 9, 2025
కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడు, కిరణ్ రిజుజు, ప్రహ్లాద్ జోషి, కిషన్ రెడ్డి సహా ఎన్డీయే కూటమి ఎంపీలు, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ సహా విపక్ష ఇండియా కూటమి ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం ఓటింగ్ కొనసాగుతోంది. ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. సాయంత్రం 6 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది. అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు.
#WATCH | Delhi | Congress MP Priyanka Gandhi Vadra arrives at the Parliament House to cast her vote for the Vice Presidential election.
(Source: Sansad TV) pic.twitter.com/T63dJCvDxE
— ANI (@ANI) September 9, 2025
పోలింగ్ సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari ) మధ్య ఆసక్తికర సంభాషణ అందరినీ ఆకట్టుకుంది. వీరిద్దరూ ఆత్మీయంగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఇద్దరూ చేతులు పట్టుకుని ఓటు వేసేందుకు వెళ్లారు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు వీరిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటున్న దృశ్యాలను తమ కెమెరాలతో క్లిక్ మనిపించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
#WATCH | Delhi | Union Minister Nitin Gadkari and Congress National President Mallikarjun Kharge arrive at the Parliament House to cast their vote for the Vice Presidential election.
(Source: Sansad TV) pic.twitter.com/L9so7EO0TA
— ANI (@ANI) September 9, 2025
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP), విపక్ష కాంగ్రెస్ (Congress)కూటములు దక్షిణాదికే చెందిన వారిని ఉపరాష్ట్రపతి అభ్యర్థులుగా ప్రకటించాయి. ఎన్డీయే తరఫున తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ (CP Radhakrishnan), ఇండీ కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి (Justice Sudershan Reddy) పోటీచేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో రాజ్యసభ, లోక్సభ సభ్యులతో కూడుకున్న ఎలక్టోరల్ కాలేజీలో ఎంపీలు తమకు నచ్చిన వారికి ఓటు వేసే వెసులుబాటు ఉంటుంది. ఈ ఎన్నిక రహస్య బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు.
Also Read..
Raj Kundra | రూ.60 కోట్ల మోసం కేసు.. రాజ్ కుంద్రాకు సమన్లు జారీ
Nepal | రణరంగంగా నేపాల్.. భారతీయులకు కీలక అడ్వైజరీ
Vice President Elections | ప్రారంభమైన ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్.. తొలి ఓటు వేసిన ప్రధాని మోదీ