Raj Kundra | బాలీవుడ్ స్టార్ నటి శిల్పాశెట్టి (Shilpa Shetty), ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా (Raj Kundra)కు మరోషాక్ తగిలింది. ఓ వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేరకు మోసం కేసు (cheating case)లో వీరు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి రాజ్ కుంద్రాకు ముంబై పోలీసులు (Mumbai Police) తాజాగా సమన్లు జారీ చేశారు. ఈనెల 15న కేసు విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. అంతేకాదు ఈ కేసుకు సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఆడిటర్‌కు కూడా సమన్లు జారీ అయ్యాయి.
శిల్పా శెట్టి దంపతులు రూ.60 కోట్ల మోసానికి పాల్పడినట్లు ముంబై వ్యాపారవేత్త దీపక్ కొఠారీ ఇటీవలే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన కంపెనీ 2015 నుంచి 2023 వరకు రుణం, పెట్టుబడి రూపంలో రూ.60.4 కోట్లను ఈ దంపతులకు ఇచ్చిందని తెలిపారు. ఈ సొమ్మును వీరు తమ వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని ఆరోపించారు. రాజేశ్ ఆర్య అనే వ్యక్తి ద్వారా తాను శిల్పా-రాజ్ దంపతులను కలిసినట్లు పిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో వారు ‘బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్’ అనే హోమ్ షాపింగ్ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులోని బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రస్తుతం మూతపడింది.
దీపక్ కొఠారీ ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసులు ప్రాథమిక విచారణ నిర్వహించి, మోసం, నమ్మకద్రోహం తదితర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మోసం మొత్తం రూ. 10 కోట్లకు పైగా ఉండటంతో, కేసును జుహు పోలీస్ స్టేషన్ నుంచి ఆర్థిక నేరాల విభాగానికి (EOW) బదిలీ చేశారు. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉంది. కేసు విచారణ సమయంలో దేశం విడిచిపోకుండా ఉండేందుకు శిల్పా దంపతులపై ఆర్థిక నేరాల విభాగం (EOW) అధికారులు ఇటీవలే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే.
Also Read..
The Bads of Bollywood | డైరెక్టర్‌గా షారుఖ్ తనయుడు.. ట్రైలర్లో మెరిసిన రాజమౌళి, ఆమిర్
The Bads of Bollywood | డైరెక్టర్‌గా షారుఖ్ తనయుడు.. ట్రైలర్లో మెరిసిన రాజమౌళి, ఆమిర్
Peter Navarro | భారత్‌కు మంచి ముగింపు ఉండదు.. న్యూఢిల్లీపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన నవారో