The Bads of Bollywood | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్యన్ దర్శకత్వంలో రాబోతున్న తాజా వెబ్ సిరీస్ ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ (Bads of Bollywood). కిల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నటుడు లక్ష్య ఈ సినిమాలో కథానాయకుడిగా నటించబోతుండగా.. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, రాజమౌళి, ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సిరీస్ సెప్టెంబర్ 18 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ ట్రైలర్లో రాజమౌళితో పాటు ఆమిర్ ఖాన్, కరణ్ జోహార్, షారుఖ్ తదితరులు సందడి చేశారు. నెట్ ఫ్లిక్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సంయుక్తంగా ఈ సిరీస్ ను నిర్మిస్తున్నారు.