Vice President Elections | భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ (Vice President Elections) మంగళవారం ఉదయం ప్రారంభమైంది. పార్లమెంట్ (Parliament) నూతన భవనంలోని ‘ఎఫ్-101 వసుధ’లో ఉదయం 10 గంటలకు ఓటింగ్ మొదలైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలి (PM Modi) ఓటు వేశారు. ఆ తర్వాత ఒక్కొక్కుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. సాయంత్రం 6 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది. అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP), విపక్ష కాంగ్రెస్ (Congress)కూటములు దక్షిణాదికే చెందిన వారిని ఉపరాష్ట్రపతి అభ్యర్థులుగా ప్రకటించాయి. ఎన్డీయే తరఫున తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ (CP Radhakrishnan), ఇండీ కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి (Justice Sudershan Reddy) పోటీచేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో రాజ్యసభ, లోక్‌సభ సభ్యులతో కూడుకున్న ఎలక్టోరల్ కాలేజీలో ఎంపీలు తమకు నచ్చిన వారికి ఓటు వేసే వెసులుబాటు ఉంటుంది. ఈ ఎన్నిక రహస్య బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు.
#WATCH | Prime Minister Narendra Modi leaves from the Parliament House after casting his vote for the Vice Presidential election.
(Video: DD News) pic.twitter.com/Kic17Kdebj
— ANI (@ANI) September 9, 2025
రాధాకృష్ణన్‌పై సుదర్శన్ రెడ్డి విజయం సాధ్యమేనా?
లోక్‌సభలో 542 మంది సభ్యులు, రాజ్యసభలో 239 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా కలిసి మొత్తం 781 మంది ఉన్నారు. ఇందులో ప్రతి సభ్యుడి ఓటు విలువ ఒకటిగానే ఉంటుంది. మెజార్టీ మార్కు 391 కాగా, బీఆర్ఎస్ (4), బీజేడీ (7)లు పోలింగ్‌కు దూరంగా ఉంటామని ఇప్పటికే ప్రకటించాయి. దీంతో 386 ఓట్లు దక్కించుకున్నవారు విజేతగా నిలువనున్నారు.
అధికార ఎన్డీయే (NDA) కూటమికి ఇప్పటి వరకు 425 సభ్యుల బలముంది. 11 మంది సభ్యులున్న వైసీపీ, స్వతంత్రుల మద్దతుతో మెజార్టీ 439కి పెరిగింది. అటు విపక్షాల ఇండియా కూటమికి (INDIA) 324 మంది బలముంది. కొన్ని పార్టీలు మద్దతు ఇచ్చినా విపక్ష అభ్యర్థి విజయానికి దూరంగానే కనిపిస్తుంది. దీంతో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలుపు ఖాయమే.!
Also Read..
Fully Literate State | 99 శాతం మంది చదువుకున్నవారే.. సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్
ఆన్లైన్లో ఆర్డరా? ఇక బాదుడే.. డెలివరీ చార్జీలపై 18 శాతం జీఎస్టీ
మల్లె పూలు తీసుకెళ్లినందుకు లక్ష జరిమానా