JP Nadda | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా (Maha Kumbh Mela) ముగింపు దశకు చేరుకుంది. మరో ఐదు రోజుల్లో మహాకుంభమేళా ముగియనుంది. ఈ క్రమంలో గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమం (Triveni Sangam)లో పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు (Devotees) భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. 45 రోజుల పాటు జరిగే ఈ కుంభమేళాకు సామాన్య భక్తులతోపాటు ప్రముఖులు కూడా తరలివస్తున్నారు.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఇప్పటికే త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా (JP Nadda) మహాకుంభమేళాను సందర్శించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.
#WATCH | Union Minister and BJP national president JP Nadda, UP CM Yogi Adityanath take a holy dip at Triveni Sangam in Prayagraj, Uttar Pradesh pic.twitter.com/1tltNiMAhU
— ANI (@ANI) February 22, 2025
కాగా, పౌష్ పూర్ణిమ సందర్భంగా జనవరి 13వ తేదీన మహాకుంభమేళా ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 శివరాత్రి (Maha Shivratri) వరకూ ఈ కుంభమేళా కొనసాగనుంది. దాదాపు 45 రోజులపాటూ జరిగే ఈ మహా కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 50 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం ముందుగా అంచనా వేసింది. అయితే, అంచనాలకు మించి భక్తులు తరలివస్తున్నారు. 41 రోజుల వ్యవధిలోనే దాదాపు 60 కోట్ల మంది భక్తులు స్నానాలు ఆచరించినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. మరో ఐదు రోజుల పాటు భక్తుల రద్దీ ఇదేవిధంగా కొనసాగుతే.. మహా కుంభమేళాలాలో పవిత్ర స్నానాలు చేసే భక్తుల సంఖ్య 65 కోట్లు దాటుతుందని యోగి ప్రభుత్వం అంచనా వేస్తోంది. మహా కుంభమేళాలో చివరి రోజైన ఫిబ్రవరి 26న రెండు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా.
Also Read..
Maha Kumbh | 41 రోజులు.. 60 కోట్ల మంది పుణ్యస్నానాలు.. చివరి దశకు మహాకుంభమేళా
Punjab | లేని శాఖకు 20 నెలలు మంత్రిగా పనిచేసిన ఆప్ నేత.. ఇదో జోక్ అంటూ బీజేపీ విమర్శ
Death Threat | రాజస్థాన్ సీఎంకు హత్య బెదిరింపులు.. చంపేస్తానంటూ జైలు నుంచి ఖైదీ ఫోన్