Death Threat | రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ (Bhajan Lal Sharma)కు హత్య బెదిరింపులు (Death Threat ) వచ్చాయి. దౌసా జైలు (Dausa jail)లో ఉన్న ఓ ఖైదీ సీఎంను చంపేస్తానంటూ ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు.
కాగా.. రింకు అనే వ్యక్తి పలు కేసుల్లో ఖైదీగా దౌసా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, అతడు జైలు నుంచి శుక్రవారం కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు. సీఎంను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు రాష్ట్ర హోంమంత్రి జవహర్ సింగ్ బేధమ్ తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. జైల్లో ఉన్న అతడికి ఫోన్ ఎలా వచ్చిందనే దానిపై దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. ఈ ఘటనలో జైలులో మరో అధికారి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు పేర్కొన్నారు.
Also Read..
Shivraj Chouhan | విరిగిపోయిన సీటు ఇచ్చారు.. ఎయిర్ ఇండియాపై కేంద్ర మంత్రి ఫైర్
Maha Kumbh | 41 రోజులు.. 60 కోట్ల మంది పుణ్యస్నానాలు.. చివరి దశకు మహాకుంభమేళా
PM Modi | మారిషన్ జాతీయ దినోత్సవానికి గౌరవ అతిథిగా ప్రధాని మోదీ