PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi ) మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. వచ్చే నెలలో జరిగే మారిషన్ 57వ జాతీయ దినోత్సవానికి (Mauritius National Day celebrations) ప్రధాని గౌరవ అతిథిగా (guest of honour) హాజరుకానున్నారు. ఈ విషయాన్ని మారిషన్ ప్రధాని రామ్‌గూలమ్ అధికారికంగా ప్రకటించారు. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలకు ఈ వేడుక సాక్ష్యంగా నిలుస్తుందని అన్నారు.
ప్రపంచ అధినేతల్లో ఒకరైన మోదీ.. తన బిజీ షెడ్యూల్లోనూ తమ ఆహ్వానాన్ని అంగీకరించడం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. 1968 మార్చి 12న బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన మారిషస్‌కు స్వాతంత్ర్యం దక్కింది. నాటినుంచి ఏటా మార్చి 12న జాతీయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటోంది. ఇక గతేడాది భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మారిషన్ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే.
Also Read..
Donald Trump | మస్క్ కుమారుడి దెబ్బకు.. 145 ఏళ్ల నాటి టేబుల్‌ను మార్చేసిన ట్రంప్
Kash Patel | భగవద్గీత సాక్షిగా.. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ ప్రమాణస్వీకారం
China | చైనాలో కొవిడ్ తరహా కొత్త వైరస్