China | చైనాలో కొవిడ్ తరహా కొత్త వైరస్
చైనాకు చెందిన పరిశోధకులు ఓ కొత్త రకమైన కరోనా వైరస్‌ను గుర్తించారు. గబ్బిలాల్లో గుర్తించిన ఈ కొత్త వైరస్‌ను హెచ్‌కేయూ5-కోవ్-2గా పిలుస్తున్నారు. కొవిడ్-19కు కారణమైన సార్స్-కోవ్-2ను ఈ వైరస్ పోలి ఉందని, మనుషులకు సైతం ఇది సోకగలదని తేల్చారు.
- గబ్బిలాల్లో గుర్తించిన పరిశోధకులు.. మనుషులకూ వ్యాపించగలదని ప్రకటన
బీజింగ్, ఫిబ్రవరి 21 : చైనాకు చెందిన పరిశోధకులు ఓ కొత్త రకమైన కరోనా వైరస్‌ను గుర్తించారు. గబ్బిలాల్లో గుర్తించిన ఈ కొత్త వైరస్‌ను హెచ్‌కేయూ5-కోవ్-2గా పిలుస్తున్నారు. కొవిడ్-19కు కారణమైన సార్స్-కోవ్-2ను ఈ వైరస్ పోలి ఉందని, మనుషులకు సైతం ఇది సోకగలదని తేల్చారు. గబ్బిలాల్లో వైరస్‌లపై అధ్యయనాలతో ‘బ్యాట్‌వుమన్’గా ప్రాచుర్యం పొందిన షి జెంగ్లీ అనే వైరాలజిస్ట్ నేతృత్వంలోని పరిశోధకులు ఈ వైరస్‌ను గుర్తించారు.
ఇందుకు సంబంధించిన వివరాలు ‘సెల్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ వైరస్ మెర్బెకోవైరస్ ఉప రకానికి చెందినదని, ఇందులో మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్(బెర్స్) వైరస్ కూడా ఉందని పరిశోధకులు తెలిపారు. ఇది హాంకాంగ్‌లోని జపనీస్ పిపిస్ట్రెల్ గబ్బిలాల్లో మొదటిసారి గుర్తించిన హెచ్‌కేయూ5 కరోనా వైరస్ శ్రేణికి చెందినదని చెప్పారు. ఈ వైరస్ మనుషులకు నేరుగా లేదా ఇతర జీవాల ద్వారా సోకే ముప్పు ఉందని హెచ్చరించారు. అయితే, కొవిడ్-19కు కారణమైన సార్స్-కోవ్-2 కంటే దీని ప్రభావం తక్కువే ఉంటుందని వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cult | ‘కల్ట్’ రిలీజ్ ట్రైలర్.. రక్తపాతం, భయంకరమైన హత్యలతో విశ్వక్ సేన్ విశ్వరూపం!
ISRO | మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. శుక్రవారం రాత్రి నింగిలోకి దూసుకెళ్లనున్న జీఎస్సెల్వీ-ఎఫ్18..!
Sri Venkateswara Creations | భారీ సాహసానికి పూనుకున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.. ఒకేసారి నాలుగు క్రేజీ చిత్రాల డిస్ట్రిబ్యూషన్!
Jailer 2 | ‘జైలర్ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా .. నవంబర్ 12 నుంచే స్ట్రీమింగ్ అంటూ ప్రచారం!
Pocket Rockets | నిహారిక కొణిదెల నిర్మాణంలో నూతన చిత్రం ‘పాకెట్ రాకెట్స్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

