Donald Trump | తన నిర్ణయాలతో ప్రపంచ దేశాలకే దడ పుట్టిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు ఓ చిన్న పిల్లాడికి భయపడ్డట్లు తెలిసింది. ఆ చిన్నారి దెబ్బకు ఏకంగా 145 ఏళ్ల నాటి ఓ టేబుల్‌నే మార్చేశారట (Trump Removes Office Desk). ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఇంతకీ ఆ చిన్నారి ఎవరనుకున్నారు. ట్రంప్ ప్రభుత్వంలో కీలకమైన డోజ్ శాఖ అధిపతి ఎలాన్ మస్క్ (Elon Musk) కుమారుడు ఎక్స్.
ఎలాన్ మస్క్ ఇటీవలే తన నాలుగేళ్ల కుమారుడు ఎక్స్‌తో కలిసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ను కలిసిన సంగతి తెలిసిందే. వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో మస్క్ తన కుమారుడితో కలిసి ట్రంప్‌ను కలిశారు. ఈ సందర్భంగా మస్క్ కుమారుడు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. మస్క్ భుజాలపైకి ఎక్కి కూర్చోవడం, ట్రంప్ పక్కన కూర్చొని ముక్కును రుద్దుకోవడం, అవే చేతులతో అధ్యక్షుడు
కూర్చున్న టేబుల్ పై చేతులతో రుద్దడం వంటి చేష్టలు చేశాడు. అతి శుభ్రత పాటించే ట్రంప్.. ఆ పిల్లాడి చేష్టలు గమనించి బ్యాక్టీరియా భయంతో టేబుల్‌ను మార్చినట్లు అమెరికా మీడియా పేర్కొంది.
ఓవల్ ఆఫీస్ (Oval Office)లో 145 ఏళ్ల పురాతన రెజల్యూట్ డెస్క్‌ను తీసేయించిన ట్రంప్.. దాని స్థానంలో సీఅండ్ఓ డెస్క్‌ను పెట్టించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా ట్రంప్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ట్రంప్ మాత్రం ఈ చర్యకు వెనక గల కారణం మరొకటని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న రిజల్యూట్ టేబుల్ 145 ఏళ్ల నాటిది కాబట్టి దాన్ని మెయింటెనెన్స్ కోసం తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు చెప్పారు. అది పూర్తయ్యాక మళ్లీ పాత టేబుల్‌నే వినియోగిస్తామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.
Also Read..
Kash Patel | భగవద్గీత సాక్షిగా.. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ ప్రమాణస్వీకారం
Elon Musk | పిల్లలు చనిపోతుంటే ఫొటో షూట్లా?.. జెలెన్స్కీపై విరుచుకుపడ్డ మస్క్