Elon Musk | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 : పిల్లలు యుద్ధ భూమిలో చనిపోతుంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్క్ భార్యతో కలిసి వోగ్ మ్యాగజైన్ కవర్‌పేజీ కోసం ఫొటోషూట్ చేశారని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో అందుకు సంబంధించిన కవర్‌పేజీ ఫొటో(జూలై 2022) షేర్ చేస్తూ జెలెన్స్కీపై పలు విమర్శలు చేశారు. ఉక్రెయిన్ మీద జెలెన్స్కీకి ప్రేమ లేదని ఆరోపించారు. ఆయన ఆ దేశ సైనికులను యుద్ధంలో సమిధలుగా మారుస్తున్నారని విమర్శించారు.