హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): సినీ ఆర్టిస్టులు 90 రోజులకోసారి డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలని, అప్పుడే సినిమా రిలీజ్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీలో ఆయన మాట్లాడుతూ డ్రగ్ టెస్ట్ చేయించుకున్న ప్రజా ప్రతినిధులు మాత్రమే అసెంబ్లీకి రావాలని సూచించారు.