హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : గడ్డి, కలుపు మందులను నిషేధించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును అసెంబ్లీ ఆవరణలో కలిసి రైతు కమిషన్ బృందం నివేదిక అందజేసింది. ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాలకుపైగా ఈ గడ్డి, కలుపు మందులను బ్యాన్ చేస్తే, మన దేశంలో మాత్రం విచ్చలవిడిగా అమ్ముతున్నారని పేర్కొన్నారు.
రైతులు క్షణికావేశంలో ఆ మందులు తాగి చనిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతు కమిషన్ ప్రతిపాదనను అసెంబ్లీలో చర్చిస్తామని, రాష్ట్రంలో నిషేధానికి చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ఇదే అంశంపై మంత్రి శ్రీధర్‌బాబును కలిసి రిపోర్టు అందజేశారు. కార్యక్రమంలో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు రాములునాయక్, కేవీఎన్ రెడ్డి, చెవిటి వెంకన్న, భవానీరెడ్డి, కమిషన్ మెంబర్ సెక్రటరీ గోపాల్ పాల్గొన్నారు.