Mallikarjun Kharge : అంటరానితనం చట్టం కింద కేసులు పెట్టండి: మల్లిఖార్జున్ ఖర్గే
Mallikarjun Kharge : ఉత్తరాఖండ్‌లోని రామ్‌లీలా మైదాన్ సభలో పాల్గొని మాట్లాడిన స్టేజ్‌ను.. బీజేపీ నేతలు శుద్ధి చేసిన అంశాన్ని విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే ఇవాళ రాజ్యసభలో ప్రస్తావించారు. స్టేజ్‌ను శుద్ది చేసిన వారిపై అంటరానితనం కింద కేసు బుక్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని రామ్‌లీలా మైదాన్‌లో తాను పాల్గొన్న స్టేజ్‌ను బీజేపీ శుద్ధి చేసిన అంశాన్ని విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) ఇవాళ రాజ్యసభలో ప్రస్తావించారు. ఆ మైదానంలో ఓ కార్యక్రమంలో పాల్గొని ఖర్గే ప్రసంగించారు. అయితే ఆయన వెళ్లిన తర్వాత అక్కడ స్టేజ్‌ను శుద్ది చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశాన్ని రాజ్యసభలో ప్రస్తావిస్తూ.. అంటరానితనం చట్టం కింద వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. హల్ద్వానిలో స్టేజ్‌ను శుద్దీకరించిన వారిని శిక్షించాలన్నారు. వాళ్లను అరెస్టు చేసి జైలుకు పంపాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా కూడా ఆ చర్యను ఖండించారని ఖర్గే తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఖర్గే మాట్లాడుతున్న సమయంలో సభలో గందరగోళం నెలకొన్నది. ఇలాంటి కార్యక్రమాలను బీజేపీ ప్రోత్సహించదు అని, ఆ ఘటన పట్ల దర్యాప్తు చేపడుతామని మంత్రి జేపీ నడ్డా అన్నారు.
హల్ద్వానీలో తాను ప్రసంగం చేసిన స్టేజ్‌ను బీజేపీ సంబంధిత వ్యక్తులు శుద్ది చేశారని ఖర్గే తన ప్రసంగంలో ఆరోపించారు. ఆ సభలో తాను కేవలం ప్రజల సమస్యల గురించి మాత్రమే మాట్లాడానని, తానేమీ మతం గురించి కానీ, ఇతర అంశాల గురించి కానీ మాట్లాడలేదన్నారు. ఆ సభా ప్రాంగణంలో హవనం, శుద్ది ప్రక్రియ నిర్వహించారని, ప్రజాస్వామ్యం ఇలాగే పనిచేస్తుందా, రాజ్యాంగాన్ని మీరు రక్షిస్తున్నారాన అని ఖర్గే ప్రశ్నించారు. ఈ అంశాన్ని రాజకీయం చేయదలుచుకోలేదని, స్టేజ్‌ను శుద్ధి చేసి తనను అవమానించారని ఆయన అన్నారు.
मेरी मांग है:
हल्द्वानी में जिन लोगों ने स्टेज का शुद्धिकरण किया, उन पर Untouchability Act के तहत केस दर्ज हो और उन्हें गिरफ्तार कर जेल भेजा जाए।
: कांग्रेस अध्यक्ष और राज्यसभा में नेता प्रतिपक्ष श्री @kharge pic.twitter.com/z4oBsRrSh3
— Congress (@INCIndia) August 13, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
Prajwal | స్టార్ హీరోలు, నిర్మాతలనే ఆటపట్టించిన బుడ్డోడు .. ‘సమ్మర్ హాలిడేస్’ ఈవెంట్లో మరోసారి హైలైట్!
లైసెన్స్ లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు : గోదారి రవికుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

