హనుమకొండ చౌరస్తా, మార్చి 18: హైదరాబాద్ గాంధీభవన్‌లో తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామేల్ బ్రాహ్మణుల పట్ల చేసిన వ్యాఖ్యలను తెలంగాణ అర్చక సమాఖ్య తీవ్రంగా ఖండించారు. వరంగల్ విప్రబ్రాహ్మణ భవన్లో బ్రాహ్మణులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ అర్చక సమాఖ్య అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ.. అన్ని వర్గాలు క్షేమంగా ఉండాలని లోకా సమస్తా సుఖినోవంతు అంటూ నిత్యం పూజలు చేసే బ్రాహ్మణు పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే అసెంబ్లీలో బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మనిజం పట్ల అవగాహన లేని వ్యక్తులు సమాజాన్ని కలుషితం చేస్తూ కులాల మధ్య చిచ్చులు పెడుతూ సమాజాన్ని విడదీయాలనే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
బ్రాహ్మణుల ఐక్యతకు త్వరలో వరంగల్‌లో రాష్ట్ర సదస్సును ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. విప్ర బ్రాహ్మణ ఫౌండేషన్ అధ్యక్షుడు వల్లూరి పవన్‌కుమార్, తెలంగాణ అర్చక సమాఖ్య అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, భీమారం బ్రాహ్మణసంఘం అధ్యక్షుడు మోత్కూరి మనోహర్‌రావు, సురేష్‌రావు, ధర్మేందర్రావు, చకిలం సుధాకర్‌రావు, కొండల్రావు, జయిప్రసాద్రావు, గణపతిశర్మ, విన్నకోట రాజ్‌కుమార్, బ్రాహ్మణ సేవా సమితి, రాష్ట్ర నాయకులు జీవీఎస్ శ్రీనివాసాచారి, రంజిత్శర్మమ, ఎరబాటి జ్యోతి, సువర్ణ, రామచంద్రమూర్తి, మంగతాయరు, అష్టలక్ష్మీ పాల్గొన్నారు.