RaashiiKhanna | పవన్ కల్యాణ్ (Pawan Kalyan)అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ (UstaadBhagatSingh). హరీష్ శంకర్ (Harish shankar) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. రాశీఖన్నా కీ రోల్ పోషిస్తోంది. టాలీవుడ్ టాప్ లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ పాటలు కంపోజ్ చేస్తుండగా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ ఎస్ థమన్ చేస్తున్నాడు.
ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో హరీష్ శంకర్, రాశీఖన్నా అండ్ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. పవన్ సినిమా అంటే సెపరేట్ మాస్ డైలాగ్స్ ఉంటాయని తెలిసిందే. ప్రత్యేకించి ఉస్తాద్ భగత్ సింగ్‌లో ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం అంటూ వచ్చే డైలాగ్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. విడుదలకు ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రమోషన్స్‌లో ఇదే డైలాగ్‌తో సినీ జనాల్లోకి వెళ్తోంది రాశీ ఖన్నా.
ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం డైలాగ్‌తో డిజైన్ చేసిన బ్లాక్ షర్ట్ వేసుకుంది రాశీఖన్నా. షర్ట్ వెనుకవైపు రాసి ఉన్న డైలాగ్‌ను చూపిస్తున్న స్టిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ టాప్ లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో పార్థీబన్ విలన్‌గా నటిస్తుండగా.. గౌతమి, కేఎస్ రవికుమార్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
#RaashiiKhanna slaying it in style for #UstaadBhagatSingh promotions.
Film in cinemas tomorrow
🎟️ https://t.co/xhhcYMp6zW#UBSOnMarch19th#UstaadUgadhi pic.twitter.com/N0lfIASA2s— Haricharan Pudipeddi (@pudiharicharan) March 18, 2026
Assembly Elections | అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన కాంగ్రెస్
Mallikarjun Kharge: మమ్ముల్ని ప్రేమించారు.. మోదీని పెళ్లి చేసుకున్నారు: మల్లిఖార్జున్ ఖర్గే
TS Assembly | యూరియా యాప్ పేరుతో ప్రభుత్వం రైతులను వేధిస్తోంది : మాజీ మంత్రి వేముల