Shivraj Chouhan | దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) సేవలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Chouhan) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవలే భోపాల్ నుంచి ఢిల్లీ (Bhopal to Delhi)కి ప్రయాణించిన సందర్భంలో తనకు విరిగిపోయిన సీటు (Broken Seat) కేటాయించినట్లు చెప్పారు. ఈ మేరకు ప్రయాణికులను ఆ సంస్థ మోసం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘నేను భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఎయిర్ ఇండియా ఫ్లైట్ నంబర్ AI436లో టికెట్ బుక్ చేసుకున్నా. నాకు సీట్ నంబర్ 8C కేటాయించారు. సీటు వద్దకు వెళ్లి చూడగా అది విరిగిపోయి ఉంది. ఇది చూసి నేను ఆశ్చర్యపోయా. ఈ విషయంపై సిబ్బందిని ప్రశ్నించగా.. సమస్యను యాజమాన్యం ఆలస్యంగా గుర్తించినట్లు చెప్పారు. అంతేకాదు ఈ సీటు టికెట్‌ను ప్రయాణికులకు విక్రయించకూడదని ఆదేశించిందని తెలిపారు. అదొక్క సీటే కాదు విమానంలోని మరికొన్ని సీట్లు కూడా ఇదే విధంగా ఉన్నట్లు సిబ్బంది చెప్పారు.
దీని వల్ల చాలా అసౌకర్యం కలిగింది. నా పరిస్థితి చూసి తోటి ప్రయాణికులు తమ సీట్లలో కూర్చోమని ఆఫర్ చేశారు. కానీ వారికి ఇబ్బంది కలిగించడం ఇష్టం లేక నేను అదే విరిగిపోయిన సీట్లో దాదాపు గంటన్నర పాటు ప్రయాణించాను. ఇలాంటి చర్యలు ప్రయాణికుల్ని మోసం చేయడం కిందకే వస్తాయి. ఎయిర్ ఇండియా నిర్వహణను టాటా గ్రూప్ తీసుకున్న తర్వాత ఎయిర్‌లైన్స్ సేవలు మెరుగుపడతాయని అనుకున్నా.. కానీ అది అపోహేనని అర్థమయ్యింది’ అంటూ కేంద్ర మంత్రి తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. కేంద్ర మంత్రి ట్వీట్‌పై ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది. మంత్రికి కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరింది.
आज मुझे भोपाल से दिल्ली आना था, पूसा में किसान मेले का उद्घाटन, कुरुक्षेत्र में प्राकृतिक खेती मिशन की बैठक और चंडीगढ़ में किसान संगठन के माननीय प्रतिनिधियों से चर्चा करनी है।
मैंने एयर इंडिया की फ्लाइट क्रमांक AI436 में टिकिट करवाया था, मुझे सीट क्रमांक 8C आवंटित हुई। मैं जाकर…
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) February 22, 2025
Dear Sir, we apologize for the inconvenience caused. Please be rest assured that we are looking into this matter carefully to prevent any such occurrences in the future. We would appreciate the opportunity to speak with you, kindly DM us a convenient time to connect.
— Air India (@airindia) February 22, 2025
Also Read..
Maha Kumbh | 41 రోజులు.. 60 కోట్ల మంది పుణ్యస్నానాలు.. చివరి దశకు మహాకుంభమేళా
PM Modi | మారిషన్ జాతీయ దినోత్సవానికి గౌరవ అతిథిగా ప్రధాని మోదీ
Kamal Haasan | భాషతో ఆటలొద్దు.. హిందీ వివాదంపై కమల్ హాసన్ హెచ్చరిక