Punjab | లేని శాఖకు 20 నెలలు మంత్రిగా పనిచేసిన ఆప్ నేత.. ఇదో జోక్ అంటూ బీజేపీ విమర్శ
Punjab | పంజాబ్ (Punjab) రాష్ట్రంలో ఆసక్తికర ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆప్ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.
Punjab | పంజాబ్ (Punjab) రాష్ట్రంలో ఆసక్తికర ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆప్ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆప్ మంత్రి ఒకరు ఉనికిలో లేని శాఖకు 20 నెలలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారంట. దీన్ని సవరించేందుకు పంజాబ్ ప్రభుత్వం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఈ విషయం బయటపడింది.
మూడేండ్ల క్రితం పంజాబ్లో భగవంత్ మాన్ (Bhagwant Mann) నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2023లో మంత్రివర్గ పునర్వవస్థీకరణ చేపట్టింది. ఇందులో భాగంగా ఆప్ సీనియర్ నేతల్లో ఒకరైన కుల్దీప్ సింగ్ ధలివాల్ (Kuldeep Singh Dhaliwal)కు రెండు శాఖలు ఎన్ఆర్ఐ వ్యవహారాలు, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ డిపార్ట్మెంట్ (Department of Administrative Reforms) బాధ్యతలు అప్పగించింది. 2024 సెప్టెంబర్లో మరోసారి పునర్వ్యవస్థీకరణ జరిపింది. అవే శాఖలు ఆయనకు కొనసాగించింది. అయితే, డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖ ఉనికిలో లేదని గ్రహించి తాజాగా మార్పులు చేసింది.
ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ శుక్రవారం విడుదల చేయడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. ఇదెక్కడి విడ్డూరం అంటూ స్థానిక రాజకీయ నేతలు మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ అంశంపై బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. పంజాబ్లో పాలనను ఆప్ ఒక ‘జోక్’లా మార్చేసిందంటూ బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఉనికిలో లేని శాఖకు 20 నెలలుగా మంత్రి బాధ్యతలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. లేని శాఖను ఒక మంత్రి నిర్వహిస్తున్నారనే విషయం ముఖ్యమంత్రికి తెలియకపోవడం.. అక్కడ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read..
Death Threat | రాజస్థాన్ సీఎంకు హత్య బెదిరింపులు.. చంపేస్తానంటూ జైలు నుంచి ఖైదీ ఫోన్
Shivraj Chouhan | విరిగిపోయిన సీటు ఇచ్చారు.. ఎయిర్ ఇండియాపై కేంద్ర మంత్రి ఫైర్
Maha Kumbh | 41 రోజులు.. 60 కోట్ల మంది పుణ్యస్నానాలు.. చివరి దశకు మహాకుంభమేళా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

