Jamili Elections | జమిలి ఎన్నికలకు సంబంధించి కీలక ముందడుగు పడింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా రూపొందించిన ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ బిల్లుకు (One Nation One Election Bill) కేంద్ర కేబినెట్ (Union Cabinet) ఆమోద ముద్ర వేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడమే తరువాయిగా ఉంది.
ఇక ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టిన తర్వాత విస్తృత సంప్రదింపుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి (జేపీసీ) సిఫార్సు చేసే అవకాశం ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ బిల్లుపై చర్చించేందుకు అన్ని రాష్ర్టాల అసెంబ్లీల స్పీకర్లనూ ఆహ్వానించనున్నట్టు సమాచారం. కాగా, జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇప్పటికే నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే.
Also Read..
Loksabha: సోరస్, అదానీ అంశాలపై లోక్సభలో గందరగోళం
పారిపోయిన నేరస్తులకు అడ్డాగా అమెరికా