న్యూఢిల్లీ: లోక్సభ(Loksabha)లో ఇవాళ కూడా గందరగోళం నెలకొన్నది. సభ ప్రారంభమైన క్షణం నుంచి అధికార, విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. దీంతో సభను మధ్యాహ్నం ఒంటి గంట వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత మరోసారి 2 గంటల వరకు వాయిదా వేశారు. అమెరికా వ్యాపారవేత్త జార్జ్ సోరస్తో కాంగ్రెస్ పార్టీకి లింకు ఉన్నట్లు బీజేపీ ఆరోపించగా, అదానీ అంశంపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఇరు వైపుల సభ్యుల నినాదాలతో సభ హోరెత్తింది. ప్రశ్నోత్తరాల సమయం పూర్తి అయిన తర్వాత.. జీరో అవర్లో ప్రతిష్టంభన మొదలైంది. ఎంపీ జ్యోతిమణి మాట్లాడుతూ.. ఓ వ్యాపారవేత్తకు, బీజేపీకి లింకులు ఉన్నట్లు ఆరోపించారు. అయితే ఆ వ్యాపారవేత్త పేరును రికార్డుల్లో చేర్చడం లేదని ప్రభుత్వం తెలిపింది. దీంతో విపక్ష సభ్యులు ఆందోళన ఉదృతం చేశారు. కాంగ్రెస్ నేతలకు, జార్జ్ సోరస్కు లింకులు ఉన్నట్లు బీజేపీ నేత నిశీకాంత్ దూబే ఆరోపించారు. ఇండియాను నిర్వీర్యం చేసేందుకు సోరస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తోందని విమర్శించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తొలుత ఒంటి గంట, ఆ తర్వాత రెండు గంటల వరకు సభను వాయిదావేశారు.
#WinterSession #WinterSession2024 #Parliament #LokSabha pic.twitter.com/XFkKGaDXu1
— LOK SABHA (@LokSabhaSectt) December 12, 2024