న్యూఢిల్లీ: టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా(Jyotiraditya Scindia)పై అనుచిత వ్యాఖ్యలు చేశారు టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ. డిజాస్టర్ మేనేజ్మెంట్ బిల్లుపై బుధవారం చర్చ జరిగిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. ఓ బిల్లుపై చర్చ సమయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఆ సమయంలో కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ.. జ్యోతిరాధిత్య అందాన్ని వర్ణించారు. ఆ ఆవేశంలోనే ఆయన లేడీ కిల్లర్ అంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి తప్పుపట్టారు.
लोकसभा में Scindia और Kalyan Banerjee में बहस, Scindia को कहा लेडी किलर तो सिंधिया ने दी चेतावनी !#jyotiradityadscindia #MPNews pic.twitter.com/qh2QYplz1S
— MP Tak (@MPTakOfficial) December 11, 2024
ఎంపీ కళ్యాణ్ బెనర్జీ క్షమాపణలు చెప్పాలని సింథియా డిమాండ్ చేశారు. అయితే టీఎంసీ ఎంపీ కళ్యాన్ బెనర్జీ.. లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పినట్లు ఇవాళ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. బుధవారం జరిగిన ఘటన దురదృష్టకరమని, ఎవరు కూడా వ్యక్తిగత ఆరోపనలు చేయరాదు అన్నారు. మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు అని, అది వారి హుందాతనాన్ని భంగపరుస్తుందని తెలిపారు.
#WATCH | Delhi: Lok Sabha Speaker Om Birla says, “Whatever happened in the House yesterday was extremely inappropriate and no comment should be made on any respected member, especially women. This is not in accordance with the dignity of the House. I would request the respected… pic.twitter.com/qIBZc2wEVO
— ANI (@ANI) December 12, 2024