IED blast : మందుపాతర పేలి (IED blast) ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు (CRPF jawans) తీవ్ర గాయాలపాలైన ఘటన ఛత్తీస్‌గఢ్ (Chattishgarh) రాష్ట్రం బస్తర్ డివిజన్ (Bastar division) లోని బీజాపూర్ (Bijapur) జిల్లాలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. ప్రస్తుతం గాయపడిన ఇద్దరు జవాన్ల పరిస్థితి విషమంగా ఉందని బీజాపూర్ ఎస్పీ (Bijapur SP) జితేంద్ర యాదవ్ (Jitendra Yadav) తెలిపారు.
సీఆర్పీఎఫ్ జవాన్లు రోడ్డు ఓపెనింగ్ కార్యక్రమానికి భద్రత కోసం వెళ్లిన సమయంలో మావోయిస్టులు పాతిపెట్టిన మందుపాతర పేలింది. పేలుడు అనంతరం మావోయిస్టులకు, జవాన్లకు మధ్య కాల్పులు కూడా చోటుచేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ముర్దొండ సెక్యూరిటీ క్యాంపు దగ్గరలోని ఆవపల్లి పోలీస్‌స్టేషన్ సమీపంలోగల తిమాపూర్-ముర్దొండ రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది.
గాయపడిన జవాన్లు ప్రస్తుతం రాయ్‌పూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ముందుగా స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం రాయ్‌పూర్‌కు తరలించారు.