AAIB report : అహ్మదాబాద్ (Ahmedabad) లో జూన్ 12న జరిగిన ఎయిరిండియా (Airindia) విమాన ప్రమాదంపై ‘ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB)’ మంగళవారం పౌర విమానయాన శాఖ (Civil Aviation Ministry) కు, సంబంధిత ఇతర అథారిటీలకు తన ప్రాథమిక నివేదిక (Preliminary report) ను అందజేసింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నత వర్గాలు వెల్లడించాయి.
తాము ఇప్పటివరకు జరిపిన విచారణ వివరాలను, కనిపెట్టిన అంశాలను ఏఏఐబీ తన ప్రాథమిక నివేదికలో పొందుపర్చినట్లు తెలిసింది. అయితే ఈ నివేదికలో ఏముందనే విషయం ఇంతవరకు బహిర్గతం కాలేదు. ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన ప్రకారం.. ఫ్లైట్ డాటా, సిబ్బంది చర్యలు, వాతావరణ పరిస్థితులు, మెకానికల్ పర్ఫార్మెన్స్ తదితర అంశాలకు సంబంధించిన కీలక పరిశీలనలను నివేదికలో పొందుపర్చినట్లు తెలుస్తోంది.
అయితే ప్రమాదంపై ఏఏఐబీ ఇంకా లోతుగా దర్యాప్తు చేయనుంది. ప్రమాదానికి గల కచ్చితమైన కారణం ఏమిటో గుర్తించి, ఇకపై అలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు కృషి చేయనుంది. కాగా గత నెల 12న అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన తర్వాత సెకన్లలోనే బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మంది ప్రయాణికులతోపాటు హాస్టల్లో ఉన్న 38 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు.