Jupiter Rising 2025 | జులై మాసం మొదలైంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ మాసం చాలా ప్రత్యేకమైంది. దీనికి కారణం దేవగురువు బృహస్పతి మిథునరాశిలో తిరిగి ఉదయించనుండడం. ప్రస్తుతం దేవగురువు మిథునరాశిలోనే సంచరిస్తుండగా.. తిరిగి జులై 9న రాత్రి 10.50 గంటలకు మిథునరాశిలో ఉదయించనున్నాడు. దాంతో ఆయన ప్రభావం భారీగా పెరుగుతుంది. దాంతో 12 రాశిచక్రాలతో సహా ప్రపంచంపై ఆ ప్రభావం కనిపిస్తుంది.
జ్యోతిషుల ప్రకారం.. దేవగరువు బృహస్పతి నవగ్రహాల్లో ప్రత్యేకస్థానం ఉంది. గురుగ్రహం శుభగ్రహంగా పేర్కొంటారు. అంతే కాకుండా జాతకంలో ఒక వ్యక్తికి వైవాహిక ఆనందం నుంచి సంపద, విద్య, వృత్తి వరకు అన్నింట్లో విజయాన్ని ప్రసాదిస్తాడు. గురువు ఒక్కో రాశిలో దాదాపు 13 నెలల పాటు సంచరిస్తాడు. ఈ క్రమంలోనే గురువు తిరిగి మిథునరాశిలోనే ఉదయించనున్నాడు. అయితే, గురువు ఉదయించడం కూడా జ్యోతిషశాస్త్రంలో ముఖ్యమైన సంఘటనలలో ఒకటి. అలాంటి పరిస్థితుల్లో గురువు ప్రభావం పెరుగనుండడంతో దేశం, ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపనుందో తెలుసుకుందాం..!
దేవుడు గురువు బృహస్పతి చాలా శుభప్రదమైన గ్రహం. ఈ గ్రహం ప్రభావంగా పెరగనుండడంతో చాలామంది ఆధ్యాత్మికత వైపు దృష్టి సారిస్తారు. అలాగే, ఆధ్యాత్మిక గ్రంథాలను చదవడంతో పాటు సాధన చేసేందుకు ప్రేరణ పొందుతారు. ఈ సమయంలో చాలా మంది జ్ఞనాన్ని పొందే మార్గాన్ని అనుసరించేందుకు ప్రయత్నిస్తారు. పూజలో ఉపయోగించే నెయ్యి, నూనె ధరల నుంచి ఉపశమనం ఉండవచ్చు. అయితే, ధూపం, సుగంధ ద్రవ్యాలు తదితర శుభకార్యాల్లో వినియోగించే వాటి ధరల పెరిగే అవకాశం ఉంది.
దేవ గురువు బృహస్పతి సంచారం ప్రభుత్వ రంగాలపై ప్రత్యేక ప్రభావం చూపుతుంది. బృహస్పతి ప్రభావం పెరుగుదల కారణంగా దేశంలో సానుకూల మార్పులను తీసుకువచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం కొత్త చట్టాలను రూపొందించే అవకాశం ఉంది. ఈ సమయంలో చేసిన విధానాలు న్యాయవ్యవస్థ పనితీరును కూడా ప్రతిబింబించనున్నాయి.
గురువు సంచారం కారణంగా అనే దేశాల మధ్య సాగుతున్న యుద్ధాలు ముగిసి శాంతి స్థాపన జరిగే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న సంఘర్షణలకు న్యాయపరమైన ముగింపు సైతం సాధ్యపడనున్నది. దాంతో పాటు స్టాక్ మార్కెట్‌పై సానుకూల ప్రభావం పడుతుంది. ఈ సమయంలో పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. మీరు పెట్టుబడి పెడితే అద్భుతమైన అవకాశాలను పొందుతారు. అయితే, బ్యాంకింగ్, ఆర్థికరంగంలో పెట్టుబడి పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది.
గురువు మిథునరాశిలో తిరిగి ఉదయించిన సమయంలో జీవితంలో విజయానికి అద్భుతమైన అవకాశాలుంటాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ఊపందుకుంటాయి. వివాహంలో అడ్డంకులన్నీ తొలగిపోతాయి. లక్ష్యాలను సాధించడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దాంతో తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం దొరుకుతుంది. గురువు ప్రభావం వల్ల మాట తీరు మెరుగై అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తిలో కూడా విజయానికి మంచి అవకాశాలు ఉన్నాయి. పనిలో మెరుగుదల ఉండవచ్చు. జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటాయి. కుటుంబ, వైవాహిక జీవితంలో పరిస్థితులు గతంలో కంటే మెరుగ్గా ఉంటాయి.