Hidden Camera | కేరళ (Kerala)లోని ప్రఖ్యాత అనంత పద్మనాభస్వామి ఆలయంలో (Padmanabhaswamy Temple) అనూహ్య ఘటన చోటు చేసుకుంది. భద్రత దృష్ట్యా పద్మనాభస్వామి ఆలయంలో ఫొటోలు, వీడియోలు తీయడాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా రహస్య కెమెరా (Hidden Camera)తో ఓ వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించాడు. గమనించిన అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
గుజరాత్‌కు చెందిన 66 ఏళ్ల (Gujarat man) సురేంద్ర షా అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి తిరువనంతపురం (Thiruvananthapuram) జిల్లాలోని ప్రఖ్యాత అనంత పద్మనాభస్వామి ఆలయ సందర్శనకు వెళ్లారు. ఆదివారం సాయంత్రం సమయంలో స్వామివారి దర్శనం కోసం వెళ్లారు. ఆ సమయంలో సురేంద్ర షా రహస్య కెమెరా అమర్చిన స్మార్ట్ గ్లాసెస్ (smartglasses)తో ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద అతని అద్దాల నుంచి కాంతి రావడాన్ని భద్రతా సిబ్బంది గుర్తించింది. దీంతో అతడిని ప్రవేశ ద్వారం వద్దే ఆపి తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో స్మార్ట్ గ్లాసెస్‌లో కెమెరాను గుర్తించారు. దీంతో పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సురేంద్రను అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం విడిచిపెట్టారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read..
Bees | విచిత్ర ఘటన.. తేనెటీగల కారణంగా గంట ఆలస్యమైన ఇండిగో విమానం
Patna businessman | వ్యాపారవేత్త గోపాల్ ఖెమ్కా హత్య కేసు.. ఎన్కౌంటర్లో కీలక నిందితుడు మృతి
Train Accident | స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు చిన్నారు మృతి, 12 మందికి తీవ్రగాయాలు