Bees | ఇప్పటికే వరుస ప్రమాదాలు, సాంకేతిక సమస్యలు, బాంబు బెదిరింపులతో భయాందోళనకు గురవుతున్న విమాన ప్రయాణికులకు తాజాగా ఓ విచిత్ర అనుభవం ఎదురైంది. తేనెటీగల (Bees) కారణంగా విమానం దాదాపు గంట ఆలస్యమైంది.
ఇండిగో (IndiGo) ఎయిర్‌బస్ A320 విమానం సోమవారం సాయంత్రం సూరత్ నుంచి జైపూర్ వెళ్లాల్సి ఉంది (Surat-Jaipur IndiGo Flight). విమానం సాయంత్రం 4:20 గంటలకు సూరత్‌లో బయల్దేరాల్సి ఉంది. దీంతో ప్రయాణికులంతా విమానంలో ఎక్కి కూర్చున్నారు. ఇక గ్రౌండ్ సిబ్బంది ప్రయాణికుల లగేజ్‌ని విమానంలోకి ఎక్కిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ తేనెటీగలు కనిపించాయి. లగేజ్ లోడ్ చేసే డోర్ దగ్గర తేనెటీగల గుంపు ఒక్కసారిగా పైకి లేచింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది విమానం టేకాఫ్‌ను ఆపేశారు.
సిబ్బంది వాటిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. తొలుత దానికి పొగ పెట్టారు. అయినా ఫలితం లేకపోవడంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది రన్‌వే వద్ద ఆగి ఉన్న విమానం వద్దకు చేరుకొని తేనెటీగలు ఉన్న లగేజ్ డోర్‌పై నీళ్లు చల్లడంతో అవి ఎగిరిపోయాయి. ఈ కారణంగా విమానం దాదాపు గంట ఆలస్యంగా బయల్దేరి వెళ్లింది.
Also Read..
Flash floods | నేపాల్-చైనా సరిహద్దు వద్ద ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన వందలాది వాహనాలు
Texas | టెక్సాస్‌లో మెరుపు వరదలు.. నిమిషాల్లోనే మాయమైన రోడ్డు.. షాకింగ్ వీడియో
Patna businessman | వ్యాపారవేత్త గోపాల్ ఖెమ్కా హత్య కేసు.. ఎన్కౌంటర్లో కీలక నిందితుడు మృతి