Patna businessman | ప్రముఖ వ్యాపారవేత్త (Patna businessman), బీజేపీ నేత గోపాల్ ఖెమ్కా (Gopal Khemka) ఇటీవలే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. గోపాల్ ఖెమ్కాపై కాల్పులు జరిపిన ప్రధాన నిందితుడు (key accused) పోలీసుల ఎన్కౌంటర్ (encounter)లో హతమయ్యాడు.
రాష్ట్రంలో అతి పురాతన మగధ దవాఖానకు (Magadh Hospital) యాజమాని అయిన గోపాల్ శుక్రర్రాత్రి 11.40 గంటల సమయంలో పట్నాలోని గాంధీ మైదాన్‌లో (Gandhi Maidan) ఉన్న తన నివాసం వద్ద కారులో నుంచి దిగుతుండగా.. బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై సిట్ బృందం దర్యాప్తు చేస్తోంది. నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తోంది.
ఈ క్రమంలో మంగళవారం ఉదయం పట్నాలోని మల్ సలామి ప్రాంతంలో సోదాలు జరుపుతుండగా పోలీసులను చూసి కీలక నిందితుడు వికాస్ అకా రాజా కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు సైతం ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో నిందితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అక్రమ ఆయుధాల తయారీ, విక్రయాలతో నిందితుడికి సంబంధాలున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
Also Read..
Mumbai | గుజరాత్ రాజధాని ముంబై.. కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై విపక్షాల ఫైర్
Train Accident | స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు చిన్నారు మృతి, 12 మందికి తీవ్రగాయాలు
స్వీయ నమోదుకు పౌరులకు అవకాశం.. డిజిటల్‌గా జనగణన