Korutla | బురఖా ధరించి బస్సెక్కిన యువకుడు.. పోలీసులకు అప్పగించిన ఆర్టీసీ అధికారులు
Korutla | పట్టణంలోని కొత్త బస్టాండులో ఓ యువకుడు బురఖా ధరించి బస్‌లో ప్రయాణించి హల్చల్ చేసిన యువకుడి విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.
కోరుట్ల : పట్టణంలోని కొత్త బస్టాండులో ఓ యువకుడు బురఖా ( Burqa ) ధరించి బస్‌లో ప్రయాణించి హల్చల్ చేసిన యువకుడి విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు, ఆర్టీసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కొత్త బస్టాండులో ఈనెల 15న మధ్యాహ్నం బురఖా ధరించి వచ్చిన ఓ వ్యక్తి మహిళల దగ్గర కూర్చుని అనుమానంగా కనిపించాడు.
యువకుడు ఫోన్లో మాట్లాడుతుండగా మగ గొంతులాగా వినిపించడం, సదరు యువకుడి కదలికలు, అసభ్య ప్రవర్తన కారణంగా మహిళలు డయల్ 100కు సమాచారం అందించారు. కోరుట్ల పోలీసులు వెంటనే ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బందికి విషయాన్ని చేరవేశారు. అక్కడికి చేరుకున్న ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బంది అతనిపై నిఘా పెట్టారు. అతను ఫోన్లో మాట్లాడుతుండగా గొంతు మగ వ్యక్తిగా నిర్ధారించుకొని అదుపులోకి తీసుకున్నారు.
విషయమై ఆరా తీయగా పొంతన లేని సమాధానం ఇచ్చాడు. దీంతో ఆర్టీసీ అధికారులు యువకున్ని పోలీసులకు అప్పగించారు. యువకుడిని కోరుట్ల మండలం మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన మహ్మద్ నోమన్ గా గుర్తించారు. తన మిత్రుడి కోరిక మేరకు బురఖా వేసుకొని బస్టాండుకు వచ్చానని, ఇన్‌స్టా్గ్రామ్ , సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు ఫ్రాంక్ వీడియోలు కఓసం బురఖా ధరించానని చెప్పాడు. మహిళలకు ఇబ్బందులకు గురిచేసేలా ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేదఇ లేదని ఎస్సై చిరంజీవి హెచ్చరించారు. యువకుడిపై పిటీ కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్..!
L Murugan | కేంద్ర మంత్రి పదవికి ఎల్ మురుగన్ రాజీనామా.. బీజేపీని తమిళనాడులో బలోపేతం చేసేందుకేనని ప్రకటన
Farmers Protest | విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదు.. కరెంటు కోసం రైతుల రాస్తారోకో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

