‘వీకేఓసీ ఉపరితల గనిలో ఉత్పత్తి ప్రారంభించాలి’
వీకేఓసీ ఉపరితల గనిలో ఉత్పత్తి ప్రారంభించి, స్థానిక కార్మికులతో ఖాళీలను సర్దుబాటు చేయాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ అన్నారు. బుధవారం కొత్తగూడెం ఏరియాలో పలు కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ
– స్థానిక కార్మికులతో ఖాళీలను సర్దుబాటు చేయాలి
– కొత్తగూడెం ఏరియా జీఎంకు ఏఐటీయూసీ నాయకుల వినతి
రుద్రంపూర్, ఫిబ్రవరి18 : వీకేఓసీ ఉపరితల గనిలో ఉత్పత్తి ప్రారంభించి, స్థానిక కార్మికులతో ఖాళీలను సర్దుబాటు చేయాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ అన్నారు. బుధవారం కొత్తగూడెం ఏరియాలో పలు కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజును కలిసి వారు చర్చించారు. ఈ సందర్భంగా ఏరియా వర్క్ షాప్‌లో క్లర్క్ ల కొరత ఉన్నందున కార్మికులకు రావాల్సిన ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, పరిపాలన సంబంధిత పనుల్లో జాప్యం జరుగుతున్నదని, కావున వెంటనే క్లర్క్ ల ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. అదేవిధంగా కార్మికవాడ గౌతంపూర్ లోని స్విమ్మింగ్ పూల్ మెయింటెనెన్స్, స్విమ్మింగ్ కోచ్ కోసం సిబ్బందిని కేటాయించాలన్నారు. సానుకూలంగా స్పందించిన జీఎం త్వరితగతన సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం సీపీఐ పార్టీ నూతనంగా ఎన్నికైన 18వ డివిజన్ కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీని జీఎం షాలెం రాజుకు పరిచయం చేసిన ఏఐటీయూసీ నాయకులు నూతనంగా ఎన్నికైన కంచర్ల హిమాశ్రీకి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో
కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి రమణ మూర్తి, బ్రాంచ్ సహాయ కార్యదర్శి గట్టయ్య, వైస్ ప్రెసిడెంట్ కతర్ల రాములు, బ్రాంచ్ ఆఫీస్ బేరర్ సందేబోయిన శ్రీనివాస్, పిట్ కార్యదర్శులు మధు కృష్ణ, సౌజన్య, సిపిఐ పార్టీ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జేములయ్య, సిపిఐ నాయకులు పాటి మోహన్, మండల రాజు, కోటి, శివ, సుదర్శన్, మన్నెంపల్లి యశ్వంత్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

