KeerthySuresh | న్యాచురల్ స్టార్ నాని హీరోగా, కయాదు లోహర్ హీరోయిన్గా మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను సెప్టెంబర్ 25న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే, సరిగ్గా అదే తేదీన నానితో పోటీ పడేందుకు ఆయన ‘దసరా’ సహనటి కీర్తి సురేష్ సిద్ధమవుతుండటం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ‘డోరతి’ చిత్రంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సంగీత మాంత్రికుడు ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతానికి ఈ రిలీజ్ డేట్‌ను తమిళ వెర్షన్ కోసం లాక్ చేసినప్పటికీ, తెలుగులోనూ ఇదే తేదీకి వస్తే బాక్సాఫీస్ వద్ద నాని సినిమాతో కీర్తి సురేష్ నేరుగా పోటీ పడాల్సి వస్తుంది. మంచి స్నేహితులుగా ఉన్న నాని, కీర్తి సురేష్‌ల చిత్రాలు ఒకే తేదీన బరిలో నిలుస్తుండటంతో ఈ బాక్సాఫీస్ క్లాష్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చివరికి ఈ సినిమాల విడుదల తేదీల్లో మార్పులు ఉంటాయా లేదా అనేదానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.