రామ్ కార్తీక్ హీరోగా, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. ఫస్ట్ కాపీ మూవీస్ మరియు కేడి అండ్ కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాచస్పతి దర్శకత్వం వహిస్తున్నారు. గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ రివీలింగ్ పోస్టర్ లాంచ్ కార్యక్రమం టాలీవుడ్ ప్రముఖ టెక్నీషియన్లు, సినీ ప్రముఖుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ ఈ చిత్ర పోస్టర్‌ను తన చేతుల మీదుగా విడుదల చేసి సినిమా యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బెక్కం వేణుగోపాల్‌తో పాటు చిత్ర బృందమంతా ఉత్సాహంగా పాల్గొంది.
ఈ సందర్భంగా వి.వి. వినాయక్ మాట్లాడుతూ, బెక్కం వేణుగోపాల్, శ్రీనివాస్ ల సహకారంతో దర్శకుడు వాచస్పతి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారని తెలిపారు. ఈ సినిమాతో హీరో రామ్ కార్తీక్, దర్శకుడు వాచస్పతిలకు మంచి పేరు రావాలని, అలాగే సంగీతంతో పాటు పాటలు కూడా అందించే ఆల్ రౌండర్ ధృవన్‌కు ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ చిత్ర యూనిట్ మొత్తానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ లభించాలని ఆకాంక్షించారు. దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ, వి.వి. వినాయక్ గారిది గోల్డెన్ హ్యాండ్ అని, ఆయన చేతుల మీదుగా తమ సినిమా పోస్టర్ లాంచ్ కావడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మీడియా సహకారంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ఒక చక్కటి సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఉంటుందని, ప్రేక్షకులను అలరించే అన్ని కమర్షియల్ హంగులు ఇందులో ఉన్నాయని తెలిపారు. అతి త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు.
హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ, తమకు ఈ చిత్రంలో అవకాశం కల్పించిన దర్శకుడు వాచస్పతికి, నిర్మాత నరేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులందరినీ అలరిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. సంగీత దర్శకుడు ఆర్.ఆర్. ధృవన్ మాట్లాడుతూ, లెజెండ్రీ డైరెక్టర్ వి.వి. వినాయక్ చేతుల మీదుగా పోస్టర్ విడుదల కావడం తన కెరీర్లో మరువలేని క్షణమని, ఒక మంచి మ్యూజిషియన్కు కావాల్సిన అన్ని రకాల ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయని వెల్లడించారు. ఈ చిత్రానికి శామ్ కె. నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా, వనరాజ్ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. వెంకట్ బద్దిగం మాటలు రాశారు. జేడీ, ఈశ్వర్ పెంటి కొరియోగ్రఫీ చేయగా, రామకృష్ణ, స్టంట్ శంకర్ ఫైట్స్ కంపోజ్ చేశారు. పీఆర్వోలుగా సోమిశెట్టి నాగేశ్వర రావు (SNR), తిరుమలశెట్టి వెంకటేష్ వ్యవహరిస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయనుంది.