SpaceX Rocket: చంద్రుడిపై కుప్పకూలిన స్పేస్ఎక్స్ రాకెట్ శకలం..
SpaceX Rocket: స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్(SpaceX Rocket) అవశేషం ఒకటి ఇవాళ చంద్రుడిపై కుప్పకూలింది. శాస్త్రవేత్తలు ఇంకా ఈ ఘటనను ద్రువీకరించలేదు. కానీ ఈ ప్రక్రియ పూర్తి అయిన ఉంటుందని అంచనా వేస్తున్నారు. గంటకు 5400 మైళ్ల వేగంతో .. సుమారు 4వేల కేజీల బరువున్న ఆ రాకెట్ శకలం చంద్రుడిని ఢీకొని ఉంటుందని భావిస్తున్నారు.
టెక్సాస్: స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్(SpaceX Rocket) అవశేషం ఒకటి ఇవాళ చంద్రుడిపై కుప్పకూలింది. శాస్త్రవేత్తలు ఇంకా ఈ ఘటనను ద్రువీకరించలేదు. కానీ ఈ ప్రక్రియ పూర్తి అయిన ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఫాల్కన్ 9 రాకెట్‌కు చెందిన రీయూజబుల్ భాగం ఒకటి చంద్రుడిపై కూలింది. జనవరి 2025లో ఆ రాకెట్‌ను ప్రయోగించారు. అయిదు అంతస్తుల ఎత్తున్న సైజులో ఆ రాకెట్ శకలం ఉంటుందని భావిస్తున్నారు. భూమిపై ఆ రాకెట్ ముక్క బరువు సుమారు 4వేల కేజీలు ఉంటుంది.
ఐన్‌స్టీన్ క్రాటర్ వద్ద స్పేస్ఎక్స్ శకలం కూలి ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాకెట్ కుప్పకూలండం వల్ల చంద్రుడిపై భారీ స్థాయిలో లోయ ఏర్పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. చంద్రుడి నుంచి ఉద్భవించే దూళి, తాకడి వల్ల ఏర్పడిన అగాధానికి చెందిన ఫోటోలను అమెరికా టెలిస్కోప్‌లు, నాసా లూనార్ రికన్నయిసెన్స్ ఆర్బిటార్, దక్షిణ కొరియాకు చెందిన దనూరి ప్రోబ్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
గంటకు సుమారు 5400 మైళ్ల వేగంతో ఆ స్పేస్ఎక్స్ రాకెట్ శకలం ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఏడాది నుంచి ఆ రాకెట్ శకలం రోదసీలో చక్కర్లు కొడుతోంది. చంద్రుడిపై రాకెట్ కుప్పకూలడం వల్ల భూమికి ఎటువంటి ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాకెట్ ఢీకొనడం వల్ల చంద్రుడిపై సుమారు 18 మీటర్ల లోతు, 12 మీటర్ల వెడల్పు ఉండే లోయ ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

