Child Marriages | బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత : మెదక్ అదనపు కలెక్టర్ నగేష్
Child Marriages | మహిళాశిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో 'బాల్య వివాహ ముక్త్ భారత్ 1-100 రోజుల ప్రత్యేక కార్యక్రమం'లో భాగంగా మంగళవారం మెదక్ జిల్లా మహిళా సంక్షేమ అధికారిణి హేమ భార్గవితో కలిసి ప్రత్యేక ప్రచార వాహనాన్నిఅదనపు కలెక్టర్ నగేష్ జెండా ఊపి ప్రారంభించారు.
Child Marriages | మెదక్ రూరల్ ఫిబ్రవరి 18 : బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత అని మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్, విజన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళాశిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో ‘బాల్య వివాహ ముక్త్ భారత్ 1-100 రోజుల ప్రత్యేక కార్యక్రమం’లో భాగంగా మంగళవారం జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవితో కలిసి ప్రత్యేక ప్రచార వాహనాన్ని మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనంలోని మైక్ సదుపాయంతో గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ బాల్యవివాహాలపై అవగాహన కల్పిస్తామన్నారు. బాల్యం ఎంతో విలువైన దశ అని, బాలబాలికలకు విద్య, ఆరోగ్యం, రక్షణ హక్కులు కల్పించడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. బాల్య వివాహాల వివరాలు తెలిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా చేయడంలో అందరూ బాధ్యత వహించాలని చెప్పారు.
జిల్లా మహిళా సంక్షేమ అధికారిణి హేమ భార్గవి మాట్లాడుతూ.. 100 రోజుల కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, గ్రామసభలు, ఆశ్రమ పాఠశాలలు, గిరిజన తండాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ రామచంద్ర రాజు, జిల్లా బాలల సంరక్షణ అధికారి నాగరాజు, మహిళా శక్తి కేంద్ర కోఆర్డినేటర్ సంతోషి, విజన్ సంస్థ డైరెక్టర్ కైలాష్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు రాజు, శరత్, సిబ్బంది సంజీవ్, నవనీత, జిల్లా బాలల సంరక్షణ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read Also :
Mammootty | రుచి, వాసన తెలియలేదు.. తొలిసారి ఆరోగ్య సమస్యపై నోరు విప్పిన మమ్ముట్టి
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

