చెన్నై: తమిళనాడులోని కడలూరులో ఘోర ప్రమాదం (Train Accident) జరిగింది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ వ్యాను కడలూరు జిల్లా సెమ్మంగుప్పం వద్ద పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 12 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానికుల సహాయంతో గాయపడిన చిన్నారులను పోలీసులు దవాఖానకు తరలించారు. ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. రైలు వచ్చే సమయంలో గేటు వేయకపోవడంతో ప్రమాదం చోటుచేసుకున్నది.